రాజమౌళి నీరు నిప్పు కథ అదేనా..?

Thu 26th Mar 2020 01:25 PM
rrr,ntr,ramcharan,rrrmotionposter,rajamouli  రాజమౌళి నీరు నిప్పు కథ అదేనా..?
Is this the story behind water and fire..? రాజమౌళి నీరు నిప్పు కథ అదేనా..?
Sponsored links

ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ఒకరకమైన ఉత్సాహాన్ని తెచ్చింది. ఉగాది పర్వదినాన రిలీజైన ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అయితే మోషన్ పోస్టర్ లో రామ్ చరణ్ ని నిప్పుగా, ఎన్టీఆర్ ని నీరుగా చూపించాడు రాజమౌళి. నీరు నిప్పు కలిస్తే వచ్చే ఎనర్జీనే ఆర్ ఆర్ ఆర్ అంటూ చూపించాడు. ఈ పోస్టర్ చూసిన ప్రతీ ఒక్కరికీ అనేక అనుమానాలు కలిగాయి. అసలు రాజమౌళి నీరు, నిప్పు కాన్సెప్ట్ ఏంటనేది తెలుసుకోవాలని ప్రతో ఒక్కరికీ ఉంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు తమకి తెలిసిన సమాధానాన్ని చెబుతున్నారు. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అల్లూరి అనగానే మనకు అతడు చేసిన విప్లవ పోరాటమే గుర్తుకు వస్తుంది. విప్లవం అంటే ఎరుపు. అల్లూరి గుండెల్లో రగిలే విప్లవం అగ్నిలా మండుతుందన్న కాన్సెప్ట్ తోనే రామ్ చరణ్ ని అగ్నిగా చూపించాడని అంటున్నారు. 

ఇక ఎన్టీఆర్ ని నీటితో ఎందుకు అభివర్ణించాడనేది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనికి కూడా ఒక కథ చెబుతున్నారు. కొమరం భీమ్ నిజాం నవాబులపై పోరాడినపుడు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో తన తిరుగుబాటుని నడిపించాడు. ఆ నినాదంలోని జల్ అనే అర్థాన్ని తీసుకునే ఎన్టీఆర్ ని నీటితో పోల్చాడని చెబుతున్నారు. ఏదేమైతేనేం మొత్తానికి కరోనా గురించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ గురించి మాట్లాడుకోవడం మంచిదే

Sponsored links

Is this the story behind water and fire..?:

In what reference rajamouli showed NTR as water and Charan as fire

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019