అనుష్క నెక్స్ట్ హీరో అతనేనా..?

Thu 26th Mar 2020 12:56 PM
anushka,ajith,gautam vasudev menon,nissabdam  అనుష్క నెక్స్ట్ హీరో అతనేనా..?
Anushkas next hero would be..? అనుష్క నెక్స్ట్ హీరో అతనేనా..?
Sponsored links

అనుష్క టాలీవుడ్ కి పరిచయమై పదిహేను సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో పదిహేను సంవత్సరాల సెలెబ్రేషన్ ని కూడా జరిపారు. ఒక హీరోయిన్ ఇన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంటే చిన్న విషయం కాదు. ఈ పదిహేనేళ్ళలో ఆమె ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్నాయి. స్టార్ హీరోలందరి పక్కన నటించింది. అలాగే లీడ్ రోల్ లోనూ నటించి విజయాలు అందుకుంది.

అనుష్క అనగానే అందరికీ జేజమ్మే గుర్తుకువస్తుంది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది అనుష్క. అయితే బాహుబలి వంటి పాన్ ఇండియన్ మూవీలో నటించిన తర్వాత హీరో పక్క హీరోయిన్ గా కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఎంచుకుంటుంది. బాహుబలి తర్వాత సైజ్ జీరో, భాగమతి, ఆ తర్వాత ప్రస్తుతం నిశ్శబ్దం.. ఇలా అన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఎంచుకుంటుంది.

అయితే ఇప్పుడు ఆమె హీరో పక్కన హీరోయిన్ గా నటించనుందట. తమిళ స్టార్ హీరో అయిన అజిత్ పక్కన అనుష్క హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ప్రేమకథా చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఇదే గనక నిజమైతే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క హీరో పక్కన చేస్తున్న చిత్రం అవుతుంది.

Sponsored links

Anushkas next hero would be..?:

Anushka as regular heroine

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019