ఆచార్య: అనుష్కది కూడా త్రిష కారణమేనా?

Anushka Says no To Acharya movie

Thu 26th Mar 2020 06:42 PM
anushka,kajal,trisha,acharya,heroine,koratala siva,chiranjeevi  ఆచార్య: అనుష్కది కూడా త్రిష కారణమేనా?
Anushka Says no To Acharya movie ఆచార్య: అనుష్కది కూడా త్రిష కారణమేనా?
Advertisement

చిరు ఆచార్య సినిమాలో త్రిష హీరోయిన్ గా ఎంటర్ అవడం.. తర్వాత అనుకోకుండా త్రిష అంటే టెక్నీకల్ కారణాల వలన బయటికొచ్చేసింది. అయితే త్రిష చిరు ఆచార్య లో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండడం వలన బయటికి వచ్చింది అని.. అలాగే రెండో హీరోయిన్ కూడా యాడ్ అవడం వలన తన పాత్రకి ప్రాధాన్యత తగ్గిపోతుంది అనే త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంది అనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు త్రిష ప్లేస్ ని కాజల్ అగర్వాల్ భర్తీ చేసింది. అయితే కాజల్ అగర్వాల్ కి ముందు అనుష్కని కొరటాల టీం సంప్రదించింది అనే టాక్ నడిచింది. అయితే అనుష్క కూడా ఆచార్యలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు.

అయితే తాజాగా అనుష్క ఆచార్యలో ఎందుకు నటించనందో అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అనుష్క కూడా ఆచార్య సినిమాలో హీరోయిన్ పాత్రకి ఎక్కువ స్పేస్ లేదు, అలాగే ఆ పాత్రకి కొన్నిచోట్ల డైలాగ్స్ కూడా లేకుండా సీన్ లో సైలెంట్ గా నిలబడాలి. ఇక పాత్ర నిడివి కూడా చాలా తక్కువ కాబట్టే అనుష్క ఆచార్యకి నో చెప్పింది అనే టాక్ నడుస్తుంది. అయితే కాజల్ మాత్రం గ్లామర్ షో చేస్తూ తన పాత్ర ప్రాధాన్యతని తానే పెంచుకునేలా డీల్ చేసుకుని.. భారీ పారితోషకం డిమాండ్ చేసినా ఆచార్య నిర్మాతలు ఒప్పుకోబట్టే.. ఆచార్యకి కాజల్ ఓకే చెప్పిందట.

Anushka Says no To Acharya movie:

Reason behind Anushka says no for Acharya


Loading..
Loading..
Loading..
advertisement