‘రౌద్రం ర‌ణం రుధిరం’.. ఊహించలేదు కదా..!

Thu 26th Mar 2020 06:37 PM
roudram ranam rudhiram,motion poster,title logo,mega fans,nandamuri fans,jr ntr,ram charan  ‘రౌద్రం ర‌ణం రుధిరం’.. ఊహించలేదు కదా..!
Rajamouli announced RRR Title ‘రౌద్రం ర‌ణం రుధిరం’.. ఊహించలేదు కదా..!
Sponsored links

రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రెండు ఈ శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా RRR టీం విడుదల చేసింది. మార్చ్ లో RRR అప్ డేట్ అని మాటిచ్చినట్టుగా రాజమౌళి RRR టైటిల్ లోగో, అండ్ మోషన్ పోస్టర్ రెండు వచ్చేసాయి. ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ ఇద్దరూ కలిపి ఉగాది సెలెబ్రేషన్స్ కి దిగేలా రాజమౌళి ప్లాన్ చేసి మరీ ఎన్టీఆర్ ని చరణ్ ని పవర్ ఫుల్ గా చూపించాడు. రామ్ చరణ్ అగ్ని కిలలా రౌద్రంగా, ఎన్టీఆర్ నీటి కనికలా రుధిరంగా చేతులు కలుపుతూ రణంలా డిజైన్ చేసారు. ఇక RRR టైటిల్ కూడా అందరూ అనుకున్నట్టుగా రామ రావణ రాజ్యం కాదు. అలాగే రఘుపతి రాఘవ రాజారామ్ కూడా కాదు.

అసలు ఎవరి ఊహకి అందనట్టుగా రాజమౌళి RRR టైటిల్ ప్లాన్ చేసాడు. ఫాన్స్ మీరే RRR టైటిల్ చెప్పండి అంటూ ఓ కాంటెస్ట్ నడిపిన రాజమౌళి ఇప్పుడు ఎవరి ఊహలకి అందని టైటిల్ ని సెట్ చేసాడు. అన్ని భాషలను దృష్టిలో పెట్టుకుని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలకు సరిపోయే ‘రౌద్రం ర‌ణం రుధిరం’ అంటూ RRR టైటిల్ ని పెట్టారు. అసలు ఇలాంటి టైటిల్ ని ఎవరు గెస్ చెయ్యలేదు కూడా. ఇక RRR  టైటిల్ అన్ని భాషల్లో ఎలా రీచ్ అవుతుందో చూడాలి. కానీ ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం పండగే పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజులా.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో సరికొత్త లుక్స్ లో ఇరగదీస్తున్నాడు. మరి ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఫాన్స్ కి రాజమౌళి నిజంగానే ఉగాది కానుకతో అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.

Sponsored links

Rajamouli announced RRR Title:

Fans Happy with Roudram Ranam Rudhiram Motion poster

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019