Advertisementt

నానితో పోటీ పడుతున్నారు.. నిలబడగలరా..?

Wed 11th Mar 2020 07:55 PM
nani,anchor pradeep,raj tarun,v the movie,orey bujjigaa  నానితో పోటీ పడుతున్నారు.. నిలబడగలరా..?
They are compete with Nani.. నానితో పోటీ పడుతున్నారు.. నిలబడగలరా..?
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ లో ఉన్న నానికి మినిమమ్ గ్యారెంటీ వసూళ్ళు వస్తాయి. మొన్న వచ్చిన గ్యాంగ్ లీడర్ అంతగా ఆకర్షించలేకపోయినా నాని మార్కెట్ పై అది పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో వి అనే సినిమా చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 25న విడుదలకి సిద్ధం అవుతోంది.

అయితే ఇప్పుడు ఆ తేదీన మరో రెండు చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా తో పాటుగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న రాజ్ తరుణ్ సినిమా ఓరేయ్ బుజ్జిగా చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. అయితే ఈ రెండు చిత్రాలలో యాంకర్ ప్రదీప్ చిత్రానికి కొద్దిపాటి బజ్ ఏర్పడింది. కానీ రాజ్ తరున్ చిత్రానికి అస్సలు బజ్ లేదనే చెప్పాలి. 

హీరోగా పరిచయం అవుతున్న ప్రదీప్, ఫ్లాపుల ద్వారా తన మార్కెట్ ని కోల్పోయిన రాజ్ తరుణ్ నానితో పోటీపడటమే విచిత్రంగా ఉంది. మరి నాని వి సినిమా ముందు ఈ రెండు చిత్రాలు తట్టుకుని నిలబడగలవా అనేదే సందేహంగా ఉంది. మరి ఏ ధైర్యంతో వీరు తమ సినిమాల్ని నానికి పోటీగా తెస్తున్నారో అర్థం కావట్లేదు.  మార్చ్ 25వ తేదీన ఏం జరగనుందో చూడాలి.

They are compete with Nani..:

Pradeep and Raj tarun compete with Nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ