Advertisement

మెగా హీరోతో మళ్ళీ ఛాన్స్..లక్కీ గర్ల్..

Wed 11th Mar 2020 06:24 PM
nivetha pethuraj,sai dharam tej. mega family,devakatta,  మెగా హీరోతో మళ్ళీ ఛాన్స్..లక్కీ గర్ల్..
She got a chance with mega hero మెగా హీరోతో మళ్ళీ ఛాన్స్..లక్కీ గర్ల్..
Advertisement

మెంటల్ మదిలో చిత్రంతో తెలుగుతెరకి పరిచయమైన భామ నివేథా పేతురాజ్ అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమాలో సెక్ండ్ హీరోయిన్ అయినప్పటికీ తన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో పెద్దగా పేరు రాలేదు. అంతకుముందు సాయి ధరమ్ తేజ్ తో చేసిన చిత్రలహరి లో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే ప్రస్తుతం ఈ భామకి మళ్లీ మెగా హీరోతో నటించే అవకాశం వచ్చింది.

సాయి ధరమ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం సాయి ధరమ్ తేజ్ దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నివేధా పేతురాజ్ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త గనక నిజమైతే ఆమె లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన నివేధాకి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా అవకాశం రావడం అదృష్టమే. మరి ఈ ఛాన్స్ తోనైనా ఆమె టాలీవుడ్ లో సెటిల్ అవుతుందేమో చూడాలి.

 

She got a chance with mega hero:

Nivetha Pethuraj got chance with mega hero

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement