సునీల్.. కోట్ల నుంచి లక్షల్లోకి..!!

Thu 05th Mar 2020 09:38 PM
sunil,remuneration,down,movies,tollywood  సునీల్.. కోట్ల నుంచి లక్షల్లోకి..!!
This is actor Sunil Situvation సునీల్.. కోట్ల నుంచి లక్షల్లోకి..!!
Advertisement
Ads by CJ

కమెడియన్‌గా పీక్స్‌లో ఉన్న సునీల్ హీరో అవతారమెత్తి.. కొద్దిపాటి సక్సెస్ అందుకున్నాడు. కానీ హీరోగా అవకాశాలు తగ్గాక మళ్ళీ కమెడియన్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ సునీల్ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఫ్రెండ్ త్రివిక్రమ్ కూడా సునీల్ మెచ్చే కేరెక్టర్స్ రాయలేక చేతులెత్తేస్తూ.. సినిమాలో అరకొర కేరెక్టర్‌తో సరిపెడుతున్నాడు. ఫ్రెండ్ త్రివిక్రమే అలా చేస్తే మిగతా దర్శకులు మాత్రం ఏం చెయ్యగలరు. సునీల్ మాట తీసెయ్యలేక ఏదో అలా అలా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం కమెడియన్ కేరెక్టర్స్‌తో పాటుగా సునీల్ విలనిజాన్ని పండించడానికి రెడీ అయ్యాడు.

డిస్కో రాజాతో విలనిజాన్ని పండించిన సునీల్‌కి అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. తాజాగా కలర్ ఫోటో సినిమాలో సునీల్ పూర్తిస్థాయి విలన్‌గా మారాడు. ప్రస్తుతం సునీల్ పరిస్థితి ఎంతగా దిగజారిందో అనేది సునీల్ రెమ్యునరేషన్ చూస్తే తెలుస్తుంది. కమెడియన్‌గా భారీ పారితోషకం అందుకుంటున్న సమయంలో సునీల్ హీరో అవతారమెత్తి.. ఒక్కో సినిమాకి కోటి నుండి రెండు.. మూడు కోట్లు కూడా తీసుకున్నాడట. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కామెడీ పాత్రలకే పరిమితమవుతున్న సునీల్ రోజుకి రెండు లక్షల పారితోషకానికి పడిపోయాడట. అదీ కూడా ఫుల్ డే మొత్తం కాల్షీట్ ఇస్తేనే రెండు లక్షలు. లేదంటే అందులోను కోత తప్పడం లేదట. ఇది విన్న అందరూ పాపం సునీల్ పరిస్థితి ఎంతగా దిగజారిందో అంటూ ఫీలవుతున్నారు. 

This is actor Sunil Situvation:

Sunil Remuneration Downed

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ