Advertisement

బన్నీ కూతురి క్లాప్‌తో మొదలైన నిఖిల్ ‘18 పేజీలు’

Thu 05th Mar 2020 09:13 PM
allu arha,clap,nikhil,18 pages movie,allu aravind,sukumar,surya pratap  బన్నీ కూతురి క్లాప్‌తో మొదలైన నిఖిల్ ‘18 పేజీలు’
Nikhil 18 Pages Movie Launch Details బన్నీ కూతురి క్లాప్‌తో మొదలైన నిఖిల్ ‘18 పేజీలు’
Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ‌ క్లాప్ కొట్ట‌గా, నిర్మాత బ‌న్నివాసు కుమార్తే బేబి హ‌న్విక‌ స్విచ్ ఆన్ చేయ‌గా 18 పేజీలు ఓపేన్ చేసిన అల్లు అర‌వింద్‌, సుకుమార్‌, బ‌న్నివాసు, నిఖిల్‌

వరుస‌గా మంచి విజ‌యాలు సాధిస్తున్న నిఖిల్‌, బ‌న్నివాసు కాంబినేష‌న్‌లో ‘18’ పేజీలు చిత్రం ఈరోజు(గురువారం) ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లు సంయుక్త నిర్మాణంలో నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్నారు. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ ని తీసుకుని మ్యూజిక‌ల్ యూత్ ఫిల్మ్ గా కుమారి 21ఎఫ్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ మ‌రో క్రేజి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యాడు. ఈరోజు ప్రారంభ‌మైన ‘18 పేజీలు’ చిత్రానికి అల్లు అర‌వింద్ పూజాకార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె బేబి అల్లు అర్హ హీరో నిఖిల్ మీద క్లాప్ నివ్వ‌గా..నిర్మాత బ‌న్నివాసు కుమార్తె బేబి హ‌న్విక‌ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. క్రియేటివ్ ద‌ర్శ‌కుడు సుకుమార్ మొద‌టి షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం చేశారు. ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అల్లు అర‌వింద్‌-నిఖిల్‌-బ‌న్నివాసు కాంబినేష‌న్‌

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఇంటిలిజెంట్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాత‌గా గ‌తంలో వ‌చ్చిన ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌ గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈరోజు అదే ఊపుతో ఇప్ప‌డు అర్జున్ సుర‌వ‌రం వంటి విజ‌యంతో యూత్ లో క్రేజిస్టార్‌గా పిలుచుకునే నిఖిల్ హీరోగా 18 పేజీలు అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మినిమ‌మ్ గ్యారంటి లేకుండా వీరిలో ఏ ఒక్క‌రూ ప్రాజెక్టు ఓకే చెయ్యర‌ని తెలిసిన వారంతా ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు భారీగా పెంచుకున్నారు.

సుకుమార్‌-ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్‌

ఇంటిలెక్చువ‌ల్ ద‌ర్శ‌కుల్లో సుకుమార్ ప్ర‌ధ‌మ‌స్థానంలో వుంటారు. ఆయన ఏ సబ్జెక్ట్ ట‌చ్ చేసినా ప్రేక్ష‌కుడి అభిరుచికి ద‌గ్గ‌ర‌గా వుంటుంది. అలాగే త‌న శిష్యుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కుమారి 21ఎఫ్ చిత్రం ఎలాంటి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికి తెలుసు. మ‌న‌సులో ఏమీ దాచుకోకుండా నిజాయితిగా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే ఏలా వుంటుందో చాలా చ‌క్క‌గా మ్యూజిక‌ల్ మ్యాజిక్ తో చూపిస్తే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మ‌ళ్లీ మరో కొత్త ట్రెండింగ్ చిత్రంతో ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ రావ‌ట‌మే కాకుండా మొద‌ట‌గా చిత్ర టైటిల్‌తోనే ఆక‌ట్టుకున్నారు. కొత్త టైటిల్‌తోనే కాదు కొత్త క‌థతో రానున్నారు. మ‌ర‌లా మ‌రో ఘ‌న‌విజ‌యానికి ఈరోజు ఈ కాంబినేష‌న్‌తో శ్రీకారం చుట్టారు

సాంకేతిక నిపుణులు..

జిఏ2 పిక్చ‌ర్స్ & సుకుమార్  రైటింగ్స్‌

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌

సంగీతం- గోపీ సుంద‌ర్‌

కెమెరా- యువ‌రాజ్‌

ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌

లైన్ ప్రొడ్యూస‌ర్‌- బాబు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌- శ‌ర‌ణ్ రాప‌ర్తి అండ్ అశోక్ .బి

ప్రొడక్ష‌న్ కంట్రోల‌ర్‌- వై. వీర‌బాబు

పిఆర్‌ఓ - ఏలూరు శ్రీను

కో-డైర‌క్ట‌ర్‌.. రాధా గోపాల్‌

నిర్మాత‌- బ‌న్ని వాసు

ద‌ర్శ‌క‌త్వం- ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే- సుకుమార్‌

Nikhil 18 Pages Movie Launch Details:

Allu Arha Clap to Nikhil 18 Pages Movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement