వెంకీ వదిలిన ‘జైసేన’ ట్రైలర్

Thu 27th Feb 2020 05:09 PM
venkatesh,jaisena,trailer,samudra  వెంకీ వదిలిన ‘జైసేన’ ట్రైలర్
venkatesh launches jaisena trailer వెంకీ వదిలిన ‘జైసేన’ ట్రైలర్
Sponsored links

విక్టరీ వెంకటేశ్ విడుదల చేసిన సముద్ర ‘జైసేన’ ట్రైలర్.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం జై సేన. ఇప్పటికే విడుదలైన  టీజ‌ర్‌, పాటలకి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైల‌ర్‌ను విక్ట‌రీ వెంక‌టేశ్ విడుద‌ల‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో  దర్శకుడు సముద్ర, నిర్మాత వి.సాయి అరుణ్‌ కుమార్‌, కో ప్రొడ్యూసర్స్‌ పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, న‌టులు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా.. విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ  - సముద్ర స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వ‌హించిన జైసేన ది పవర్ ఆఫ్ యూత్ మూవీ  ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఎపుడైనా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, సాలిడ్ స్క్రిప్ట్ తో వ‌స్తారు స‌ముద్ర‌. ఈ సినిమాకి కూడా లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో ఒక మంచి స్క్రిప్ట్ తీసుకున్నారు. శ్రీకాంత్, సునీల్ తో పాటు చాలా మంది యంగ్ స్టర్స్ ఈ సినిమాలో నటించారు. నిర్మాణ విలువలు కూడా ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సినిమాలా ఉన్నాయి. దర్శకుడు స‌ముద్ర‌తో పాటు ఈ టీమ్ అంద‌రికి ఒక మంచి సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ  - మా సినిమా ట్రైలర్ విడుదలచేసిన విక్టరీ వెంకటేశ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు వెంకటేష్ గారు రిలీజ్ చేసిన ట్రైలర్ కి అంతకన్నా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాం. అందరి హీరోల అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం జైసేన. అన్నారు

నటుడు శ్రీ కార్తికేయ మాట్లాడుతూ  - వెంకటేశ్  గారి చేతుల మీదుగా మా ట్రైలర్ విడుదలవ్వడం హ్యాపీ గా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నారు.

నటుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ - అతి త్వరలో మీ అందరిని థియేటర్స్ లో కలవబోతున్నాము. మా చిత్రానికి అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అన్నారు.

న‌టుడు అభిరామ్ మాట్లాడుతూ - వెంకటేశ్  గారు మా  ట్రైలర్ విడుదలచేయ‌డం చాలా సంతోషంగా ఉంది. సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది. అన్నారు.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.

Sponsored links

venkatesh launches jaisena trailer:

jaisena movie trailer released 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019