‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మేకింగ్ వీడియో వచ్చింది

Thu 27th Feb 2020 05:17 PM
raj tarun,orey bujjiga,movie,song making,video,release  ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మేకింగ్ వీడియో వచ్చింది
orey bujjiga movie song making video released ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మేకింగ్ వీడియో వచ్చింది
Sponsored links

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ చిత్రం నుండి ‘కురిసెన.. కురిసెన..’ సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల‌

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా....’ ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. రీసెంట్‌గా  ఈ చిత్రం నుండి అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ప్ర‌ముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్స్ అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన అద్భుతంగా ఆల‌పించిన  ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ సాంగ్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ నుండి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను విడుద‌ల‌ చేసింది చిత్ర‌యూనిట్‌.

సందర్భంగా యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ  - ఒరేయ్‌బుజ్జిగా..లో ఫ‌స్ట్ సాంగ్ కురిసెన‌..కురిసెన‌. అనూప్  రూబెన్స్ సంగీత సార‌థ్యంలో అర్మాన్‌ మాలిక్, పి.మేఘన అద్భుతంగా పాడారు. కె.కె గారు చాలా అందంగా లిరిక్స్ రాశారు. ఈ మ‌ధ్య కాలంలో వ‌న్ ఆఫ్ బెస్ట్ లోకేష‌న్స్‌లో చిత్రీకరించిన ల‌వ్‌లీ డ్యూయెట్ ఇది. క‌చ్చితంగా ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతుంది అన్నారు.

హీరోయిన్  మాళవిక నాయర్ మాట్లాడుతూ  - చిత్రంలో ఓ మంచి సిట్యుయేషన్‌లో వచ్చే ఫ‌స్ట్ సాంగ్ ఇది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు.  ఐ.ఆండ్రూ ఈ పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. నేను ఈ పాట‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌కి ఒక లెవ‌ల్‌లో ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. అన్నారు.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - కురిసెన.. కురిసెన పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే  సోష‌ల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా యూత్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కె.కె. మంచి సాహిత్యాన్ని అందించారు. దానికి తగ్గట్టుగానే అనూప్‌ రూబెన్స్  అద్భుతంగా  కంపోజ్‌ చేశారు.  పాట ఎంతో బాగుందంటూ నా మిత్రులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ పాట‌కు వ‌చ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం. పాట మాదిరిగానే ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో మిగతా పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. తప్పకుండా మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అవుతుంద‌నే నమ్మ‌కం ఉంది. ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మా బేనర్‌లో తప్పకుండా  మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Sponsored links

orey bujjiga movie song making video released:

orey bujjiga movie latest update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019