ప్రభాస్ ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది..!?

Tue 25th Feb 2020 11:42 PM
good news,rebal star prabhas,darling fans,actor prabhas  ప్రభాస్ ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది..!?
Good News For Rebal Star Prabhas Fans! ప్రభాస్ ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది..!?
Sponsored links

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయనకున్న ఫ్యాన్.. అందులోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇందులో ప్రభాస్ నుంచి మాస్‌ను ఆశించి అభిమానులే ఎక్కువ శాతం ఉన్నారు. అప్పుడెప్పుడో ‘ఛత్రపతి’ లాంటి సినిమాలో డార్లింగ్‌లోని మాస్‌ను చూసిన వీరాభిమానులు ఆ తర్వాత అస్సలు చూడలేదు. అన్నీ ప్రేమ కథలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ చేరువయ్యే కథలు, ‘బాహుబలి పార్ట్-1,2’ ఇవే సరిపోయాయ్.. అయితే మాస్ కథ చేయాలని ప్రభాస్‌కూ ఉన్నప్పటికీ అలాంటి కథలు రాకపోవడంతో మిన్నకుండిపోతున్నాడట.

ప్రస్తుతం ‘జాన్’ (ఇంకా క్లారిటీ రాలేదు) సినిమా పూర్తయిన అనంతరం ఓ ఊర మాస్ కథతో అభిమానుల ముందుకు రావాలని అనుకుంటున్నాడట. అంటే.. మరోసారి ప్రభాస్‌లో ‘ఛత్రపతి’ని చూస్తారన్న మాట. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో ‘పక్కా లోకల్’ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటారట. కుర్రవయసులో ఉన్న యువకుడిగా ప్రభాస్ రఫ్ లుక్‌లో కనిపిస్తాడట. ఇదే తరుణం కోసమే ప్రభాస్ అభిమానులు కూడా ఎదురుచూస్తుండటంతో ఈ వార్తలు వాళ్ల ఆశలను మరోసారి చిగురింప జేశాయి. దీంతో ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారట. 

కాగా.. ఈ మధ్యే ‘అర్జున్ రెడ్డి’ సినిమా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా.. ఓ స్టార్ హీరో తనకు హ్యాండివ్వడంతో ప్రభాస్‌ను ఆయన సంప్రదించాడని.. కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు గుప్పుమన్నాయ్. అయితే పైన చెప్పుకున్న సినిమా సందీప్‌దేనా..? లేకుంటే మరో డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా..? అనేది మాత్రం తెలియరాలేదు కానీ పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయ్.. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.

Sponsored links

Good News For Rebal Star Prabhas Fans!:

Good News For Rebal Star Prabhas Fans!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019