వి అంటే విలన్..అనుకుంటే పొరపాటే...

Sun 23rd Feb 2020 10:09 PM
nani,sudheer babu,indraganti mohanakrishna  వి అంటే విలన్..అనుకుంటే పొరపాటే...
Nanis V movie titile means వి అంటే విలన్..అనుకుంటే పొరపాటే...
Sponsored links

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహనక్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వి. సుధీర్ బాబు మరో హీరోగా కనిపిస్తున్నాడు. అయితే సాధారణంగా మోహనక్రిష్ణ సినిమా పేర్లన్నీ తెలుగుపేర్లే ఉంటాయి. కానీ ఈ సారి కొత్తగా వి అనే పేరును పెట్టారు. ఈ పేరు పెట్టినప్పటి నుండి ఈ సినిమా టైటిల్ పై ఆసక్తి బాగా పెరిగింది. అసలు వి అంటే ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో నాని ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు.

 

అంటే మొదటిసారి విలనిజాన్ని పండించబోతున్నట్లు తెలుస్తుంది. నాని విలన్ గా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకి అర్థం విలన్ అయి ఉంటుందని భావించారు. కానీ అసలు విషయానికి వస్తే టైటిల్ వి అంటే విలన్ కాదట. ఈ సినిమా నాని సైకో కిల్లర్ గా కనిపిస్తున్నాడట. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరుగా నానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడట. నాని చేసే ప్రతీ హత్య దగ్గర వి అనే లెటర్ ని పెడుతుంటాడట. సుధీర్ బాబు ఆ లెటర్ కి ఉన్న క్లూ సాయంతో నానిని పట్టుకుంటాడట. మరి ఈ వార్త ఎంతమేరకు నిజమో సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.

Sponsored links

Nanis V movie titile means:

Natural star nani new upcoming movie V directed by Indraganti MOhanakrishna

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019