పవన్ కోసం క్రిష్ ప్లాన్ మార్చాడు..!

Mon 24th Feb 2020 12:21 AM
pawan kalyan,krish,movie,latest,update  పవన్ కోసం క్రిష్ ప్లాన్ మార్చాడు..!
Pawan Kalyan and Krish Movie Film Latest Update పవన్ కోసం క్రిష్ ప్లాన్ మార్చాడు..!
Sponsored links

పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా సినిమాలు చేస్తే అంత త్వరగా రాజకీయాలతో బిజీ అవ్వాలి. ప్రస్తుతం సినిమా, రాజకీయం అంటున్నప్పటికీ అది అంతగా వర్కౌట్ అయ్యేలా లేదు కాబట్టి త్వరగా సినిమాలు చేసి బయటపడాలని ఒకదాని మీద ఒకటి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. పింక్ రీమేక్ షూటింగ్ ని వేణు శ్రీరామ్ పవన్ ఫ్రీని బట్టి పరిగెత్తిస్తున్నాడు. మరోపక్క క్రిష్ సినిమా కోసం పవన్ పరుగులు పెడుతున్నాడు. క్రిష్ కూడా తాను సినిమా ఒప్పుకుంటే ఆఘమేఘాల మీద సినిమా పూర్తి చేసేస్తాడు. అది చారిత్రకం అయినా కమర్షియల్ అయినా సరే. గతంలో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఎంత ఫాస్ట్ గా పూర్తి చేసాడో తెలుసు. ఇక బాలీవుడ్ లో మరో చారిత్రాత్మక చిత్రాన్ని క్రిష్ అంతే ఫాస్ట్ గా తెరకెక్కించాడు.

తాజాగా క్రిష్ సినిమా కూడా చారిత్రకత నేపథ్యం కలిగిఉన్న కథతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం చాలా కాస్ట్లీ సెట్స్ అంటే చారిత్రాత్మక కట్టడాల సెట్స్ అవసరమవుతున్నాయి. కొన్ని సెట్స్ వేస్తున్నప్పటికీ వాటి వలన టైం వేస్ట్ అవుతుందట. అందుకే క్రిష్ కూడా సెట్స్ చాలా త‌క్కువ వాడుకుంటూ బ్లూమాట్స్‌పై ఆధార‌ప‌డుతూ షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ సినిమాని త‌క్కువ స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని క్రిష్ ల‌క్ష్యంగా పెట్టుకున్నాడని కాబట్టి సెట్స్ నిర్మాణానికి టైమ్ లేదు గనుకనే బ్లూమాట్స్ వైపు దృష్టి నిలిపాడు అని అంటున్నారు. ఇక బడ్జెట్ విషయంలో క్రిష్ కి ఎలాంటి లోటు లేదని కాబట్టి నాణ్య‌త విష‌యంలో క్రిష్ రాజీ ప‌డ‌డం లేదు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, షాట్స్ హాలీవుడ్ చిత్రాల్ని మ‌రిపించేలా ఉంటాయ‌ని చెబుతుంది మూవీ టీం.

Sponsored links

Pawan Kalyan and Krish Movie Film Latest Update:

Pawan Kalyan Busy with Movie Shootings

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019