‘గతం’ టీజర్ వదిలిన హీరో అడవి శేష్

Sat 22nd Feb 2020 11:23 PM
adivi sesh,gatham,movie,teaser,release  ‘గతం’ టీజర్ వదిలిన హీరో అడవి శేష్
Gatham Movie Teaser Released ‘గతం’ టీజర్ వదిలిన హీరో అడవి శేష్
Sponsored links

‘గతం’ టీజర్ ను రిలీజ్ చేసిన హీరో అడవి శేష్

విభిన్న కథాంశంతో తెలుగు తెరపై రాబోతున్న చిత్రం ‘గతం’. ఓ జంట మధ్య జ్ఞాపకాలు చెరిగిపోతే వారిద్దరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారనే లైన్ తో కిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను యువ కథానాయకుడు అడవి శేషు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి అభిమానులతో పంచుకున్నారు. జస్ట్ ఇమాజిన్ ... లైఫ్ రీస్టార్ట్ అయితే... అంటూ ఆసక్తికరమైన డైలాగ్ తో మొదలైన గతం ట్రైలర్... ఏ రిలేషన్ షిప్ లోనైనా లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేది మెమెరీస్. కానీ మన మధ్య అవి చెరిగిపోయాయంటూ హీరో హీరోయిన్లు తమకున్న ప్రాబ్లమ్ ను వ్యక్తం చేయడం సినిమా ఎంత థ్రిల్లింగ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది. భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఆఫ్

బీట్ ఫిల్మ్స్ అండ్ ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు నిర్మించారు. పూర్తి స్థాయిలో అమెరికాలో మూడు నెలలపాటు ఎముకలు కొరికే చలిలో షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న గతం ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు : భార్గవ పొలుదాసు, రాకేశ్ గాల్బే, పూజిత కూరపర్తి

రచన, దర్శకత్వం: కిరణ్ రెడ్డి

నిర్మాతలు : భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్, సృజన్ ఎరబోలు

నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫి:మనోజ్ రెడ్డి

ఎడిటర్: జి.ఎస్

స్టంట్: డెన్నిస్ గర్

సౌండ్ డిజైన్: డేవిడ్ డె లుకా

పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా

Sponsored links

Gatham Movie Teaser Released:

Adivi Sesh Releases Gatham movie Teaser

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019