మహేష్, వంశీల సినిమా ఆగిపోయిందా..?

Sat 22nd Feb 2020 06:26 PM
mahesh babu,vamshi paidipally,mythri movie makers  మహేష్, వంశీల సినిమా ఆగిపోయిందా..?
Mahesh, vamshi movie is on Hold..? మహేష్, వంశీల సినిమా ఆగిపోయిందా..?
Sponsored links

సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దూకుడు తర్వాత మళ్ళీ అలాంటి మాస్ సినిమా కావడంతో  జనాలకి బాగా నచ్చేసింది. అందుకే మహేష్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవగలిగింది. అయితే ఈ సినిమా అనంతరం వంశీ పైడిపలితో సినిమా చేస్తానని చెప్పిన మహేష్ సడెన్ గా దానికి బ్రేక్ ఇచ్చాడని సమాచారం.

 

మహర్షి లాంటి సూపర్ సక్సెస్ ఇచ్చిన వంశీ మళ్ళీ మహేష్ తో సినిమా చేయడానికే వెయిట్ చేసి ఒక సూపర్ థ్రిల్లర్ తయారు చేసాడట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటుందట. మొత్తం పూర్తి అయ్యాక మే నలలో ఈ సినిమాని సెత్స్ మీదకి తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నాడట. కానీ సడెన్ గా వీరిద్దరి మధ్య సినిమా హోల్డ్ లో పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకు హోల్డ్ లో పడిందనే దానిపై సరైన సమాచారం మాత్రం లేదు. 

 

కానీ కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో దర్శకుడు పరశురాంతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, అందుకే వంశీ సినిమాని హోల్డ్ లో పెట్టాడని చెప్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో కొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. ప్రస్తుతానికి వంశీ పైడిపల్లి మహేష్ తో చేసే సినిమా స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలోనే ఉన్నాడట..

Sponsored links

Mahesh, vamshi movie is on Hold..?:

Super star Mahesh babu movie with Director Vamshi Paidipally is on holdd..

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019