‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

Sat 22nd Feb 2020 08:23 PM
mega prince,varun tej,raj tarun,orey bujjiga,movie,first single,launch  ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది
Orey Bujjiga Movie First Single Released ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది
Sponsored links

కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..

మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసిన మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌

‘విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం.. కాలవాంది సొంతం.. పెరిగిందే ఇష్టం..’ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ సాహిత్యానికి అనూప్‌ రూబెన్స్‌ అందించిన స్వరాలు తోడైతే.. ఓ అద్భుతమైన రొమాంటిక్‌ సాంగ్‌ ఆవిష్కృతం అవుతుంది. ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ చిత్రం కోసం అలాంటి ఓ అందమైన ప్రేమగీతాన్ని రచయిత కె.కె., సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ సమకూర్చారు. అంతే అద్భుతంగా ఈ పాటను ఆలపించి వీనుల విందు కలిగించారు అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఈ పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసారు.

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో కొండా విజయ్‌కుమార్‌ రూపొందిస్తున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ చిత్రంలో ఓ మంచి సిట్యుయేషన్‌లో వచ్చే పాట ఇది. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు  విడులదవుతున్నాయి. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఈ పాటను అందమైన లొకేషన్లలో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌పై చిత్రీకరించారు. ముఖ్యంగా ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతుందని ఈ పాటలోని కొన్ని ఫ్రేమ్స్‌ చూస్తేనే అర్థమైపోతుంది.

ఈ ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైన సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ... ‘‘వరుణ్‌తేజ్‌గారు మా సినిమాలోని మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ పాటకు కె.కె. ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. దానికి తగ్గట్టుగానే అనూప్‌ రూబెన్స్‌ మంచి మ్యూజిక్‌ చేశారు. మా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుంచి అన్నీ పాజిటివ్‌ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి. ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు మొదటి పాటకు సెకన్ల వ్యవధిలోనే మంచి వ్యూస్‌ వచ్చాయి. పాట ఎంతో బాగుందంటూ కామెంట్స్‌ కూడా పెడుతున్నారు. మిగతా పాటలు కూడా బాగా కుదిరాయి. తప్పకుండా మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అవుతుంది. ప్రస్తుతం మా సినిమాకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఉగాది కానుకగా మార్చి 25న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో తప్పకుండా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది.’’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

Sponsored links

Orey Bujjiga Movie First Single Released:

Mega Prince Varun Tej Launches Orey Bujjiga Movie First Single

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019