‘ఉప్పెన’ టీమ్‌కు రామ్ చరణ్ శుభాకాంక్షలు

Sat 22nd Feb 2020 08:21 PM
ram charan,wishes,vaishnav tej,uppena,movie,team  ‘ఉప్పెన’ టీమ్‌కు రామ్ చరణ్ శుభాకాంక్షలు
Ram Charan Wishes to Uppena Movie Team ‘ఉప్పెన’ టీమ్‌కు రామ్ చరణ్ శుభాకాంక్షలు
Sponsored links

వైష్ణవ్ తేజ్ ను చిత్రసీమలోకి ఆహ్వానించిన రామ్ చరణ్.. ‘ఉప్పెన’ టీమ్ కు శుభాకాంక్షలు

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తన కజిన్ వైష్ణవ్ తేజ్ ను ఆహ్వానించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతను హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో, ‘బిగ్ వెల్కమ్ వైష్ణవ్ తేజ్! ఈ జర్నీని నువ్వు ప్రేమిస్తావు. పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదించు. బుచ్చిబాబు సానా, కృతి శెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని పోస్ట్ చేశారు.

ఈ మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్ లో హీరోయిన్ కృతి శెట్టిని ఫాలో అవుతూ కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్రధాన తారాగణం:

పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ

సాంకేతిక వర్గం:

మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్

సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: మౌనిక రామకృష్ణ

పీఆర్వోలు: వంశీ-శేఖర్, మధు మడూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.

సీఈఓ: చెర్రీ

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.

Sponsored links

Ram Charan Wishes to Uppena Movie Team:

Mega power Star Support to Uppena Team

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019