నాన్న నాన్నే.. నో మొహమాటం : బన్నీ

Tue 18th Feb 2020 05:45 PM
stylish star,allu arjun,remunaration,ala vaikunthapuramulo,allu aravind,bunny vas  నాన్న నాన్నే.. నో మొహమాటం : బన్నీ
News About Stylish Star Bunny! నాన్న నాన్నే.. నో మొహమాటం : బన్నీ
Sponsored links

అదేదో సామెత ఉంది కదా.. తమ్ముడు తమ్ము్డే.. పేకాట పేకాటే అన్నట్లుగా.. ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాడు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఏంటి ఇంకా క్లారిటీ రాలేదా..? నాన్న.. నాన్నే.. డబ్బులు డబ్బులే.. నో మొహమాటం.. అంటే పారితోషిక విషయంలో మాత్రం ఎవరైనా తనకు ఒక్కటే అని బన్నీ చెప్పేస్తున్నాడు. అవునా..? నిజంగానే బన్నీ అంతమాట అన్నాడా..? అని నమ్మ బుద్ధవ్వట్లేదా ఏంటి..? పూర్తి క్లారిటీ రావాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి ఇక ఆలస్యమెందుకు!.

బన్నీ తన కెరీర్‌లోనే ‘అల వైకుంఠపురములో..’ మూవీతో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. మరీ ముఖ్యంగా కలెక్షన్లపరంగా నాన్ బాహుబలి రికార్డులను సైతం బద్ధలు కొట్టేశాడని చిత్రబృందం చెప్పుకుంటోంది. ఇది ఎంతవరకు నిజం.. అబద్ధం అనేది పక్కనెడితే.. సినిమా సక్సెస్ అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ టాపిక్ వచ్చింది. మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు..? మీరు తీసుకున్న డబ్బులు అంతా మీ తండ్రి అల్లు అరవింద్ ఖాతాలోకే వెళ్తోంది..? అని తెలిసింది నిజమేనా..? ఒక వేళ మీ నాన్న నిర్మాతగా వ్యవహరిస్తే మీరు రెమ్యునరేషన్ తీసుకుంటారా..? అనే ప్రశ్నలు ఎదురయ్యాయ్. ఈ ప్రశ్నలకు బన్నీ చాలా లాజిక్‌గా.. ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడు.

నాన్న నాన్నే.. డబ్బులు డబ్బులే!

‘మా నాన్న ఖాతాలోకి వెళ్తుంది అనేది అవాస్తవం.. అలాంటిదేమీ లేదు. మా నాన్న నిర్మాతగా వ్యవహరించినా రెమ్యూనరేషన్ విషయంలో అలాంటి మొహమాటాలేవీ ఉండవు. అల సినిమాకు నాకు ముట్టాల్సిందంతా ముట్టింది. రెమ్యునరేషన్ మాత్రం మా నాన్నతో నేను డైరెక్టుగా మాట్లాడను.. మా ఇద్దరి మధ్య నాకు మంచి స్నేహితుడు, నిర్మాత అయిన బన్నీ వాసు మాట్లాడతాడు. అంతేకాదు.. మా నాన్నతో కూడా బన్నీవాసే బేరాలు ఆడతాడు..’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అంటే డబ్బులు డబ్బులే.. నాన్న నాన్నే అన్న మాట.

Sponsored links

News About Stylish Star Bunny!:

News About Stylish Star Bunny!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019