అర్జున్ రెడ్డితో పోలిక సినిమాకి ప్లస్సా..మైనస్సా...?

comparison with Arjun Reddy will be plus or minus?

Wed 12th Feb 2020 09:00 PM
arjun reddy  అర్జున్ రెడ్డితో పోలిక సినిమాకి ప్లస్సా..మైనస్సా...?
comparison with Arjun Reddy will be plus or minus? అర్జున్ రెడ్డితో పోలిక సినిమాకి ప్లస్సా..మైనస్సా...?
Advertisement

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేమికుల రోజున విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి విజయ్ ని విమర్శించే వారందరూ ఈ సినిమాకి అర్జున్ రెడ్డితో పోలికలున్నాయని, ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి విజయ్ బయటపడట్లేదని, తొందరగా బయటకి వచ్చి విభిన్నమైన చిత్రాల్ని చేయాలని సోషల్ మీడియాలో ఉచిత సలహాలు ఇస్తున్నారు.

 

అయితే అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ ని ఎంతలా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా వల్లే విజయ్ కి స్టార్ స్టేటస్ వచ్చింది. అప్పటి నుండి ప్రొడ్యూసర్లు అందరూ విజయ్ తో సినిమా చేయడానికి ఎగబడ్డారు.  అయితే అర్జున్ రెడ్డి క్రేజ్ వరకూ ఓకే కానీ.. ఆ సినిమాతో తన తర్వాతి చిత్రాలకి పోలిక ఉండటం విజయ్ కి మైనస్ గా మారింది

 

విజయ్ గత చిత్రమైన డియర్ కామ్రేడ్ విషయంలో ఇలాగే జరిగింది. నిజానికి డియర్ కామ్రేడ్ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. కానీ కొన్నింటిలో అర్జున్ రెడ్డితో పోలికలు ఉండటం వల్ల ఆ సినిమాకి మైనస్ గా మారింది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయంలోనూ అలాగే జరగనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇదే విషయాన్ని విజయ్ ని అడగగా దానికి ఈ విధంగా సమాధానమిచ్చాడు. అర్జున్ రెడ్డితో పోల్చితే మంచిదే. ఆ సినిమా నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  కానీ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నాలుగు కథలున్నాయి. వాటిలో ఒక పార్ట్ తో అర్జున్ రెడ్డితో పోలికలు ఉంటే ఉన్నాయేమో.. కానీ మిగతా కథలన్ని చాలా విభిన్నంగా, సరికొత్తగా ఉంటాయి. అవి చూసినపుడు మీరు ఖచ్చితంగా కొత్త అనుభూతికి లోనవుతారు అని చెప్పాడు.

comparison with Arjun Reddy will be plus or minus?:

Vijay devarakonda upcoming movie world famous lover will be releasing on february 14th.

Tags:   ARJUN REDDY

Loading..
Loading..
Loading..
advertisement