బాలీవుడ్‌లో మూవీ చేసేందుకు సిద్ధమైన బన్నీ!

Allu arjun wants to do bollywood movie

Wed 12th Feb 2020 07:47 PM
allu arjun  బాలీవుడ్‌లో మూవీ చేసేందుకు సిద్ధమైన బన్నీ!
Allu arjun wants to do bollywood movie బాలీవుడ్‌లో మూవీ చేసేందుకు సిద్ధమైన బన్నీ!
Advertisement

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిస్థితే కాదు మన హీరోల పరిస్థితి కూడా మారిపోయింది. బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోవడంతో మిగతా హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు తీసి నేషనల్ వైడ్ పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో అల్లు అర్జున్ కుడా ఒకరు. ఈ మధ్య అల్లు అర్జున్ ని గమనిస్తే పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎంత తహతహలాడుతున్నాడో తెలుస్తుంది.

 

అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ కి ముందు బాలీవుడ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం దగ్గర నుండి ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ పేరుతో ఆ ఇంటర్వూలని కొనసాగిస్తున్నాడు. అల్లు అర్జున్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి బాలీవుడ్ లో సినిమా చేయాలనుందని చెప్పేశాడు. గత కొన్ని రోజులుగా తనకి కూడా హిందీలో సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తుందట. 

 

తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. మరి బాలీవుడ్ లో సినిమా చేస్తే ఆ రేంజ్ వస్తుందా అంటే సందేహమే.. అయితే ఇక్కడ అల్లు అర్జున్ నమ్మే విషయం ఒకటుంది. అల్లు అర్జున్ హిందీ అనువాద చిత్రాలకి యూట్యూబ్ లో విపరీతమైన వ్యూస్ వస్తుంటాయి. దీన్ని బట్టి అక్కడ డైరెక్ట్ గా సినిమా చేస్తే ఆ రీచ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాడు. మరి అల్లు అర్జున్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

 

Allu arjun wants to do bollywood movie:

Allu Arjun wants to do movie in bollywood

Tags:   ALLU ARJUN

Loading..
Loading..
Loading..
advertisement