ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Master Recent look Copied By Telugu Film!

‘మాస్టర్‌’ లుక్‌ కాపీ పేస్ట్ చేసేశారుగా!

కోలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరైన విజయ్ సినిమా అంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఎగబడతారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా ఏదైనా ప్రారంభం అయ్యిందంటే చాలు.. అది రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్‌ను షేక్ చేసే వరకూ ఆయన వీరాభిమానులు తమవంతుగా ప్రయత్నాలు చేస్తుంటారు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాను లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఒకట్రెండు లుక్స్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం రిపబ్లిక్ డే సందర్భంగా ఫైట్‌ సీన్‌ ఉండే ఓ మాస్ లుక్‌ను విడుదల చేసింది.

తాజా లుక్ అదిరింది మాత్రం సూపర్బ్.. అదిరిపోయింది.. కానీ.. దీన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం తెలుగులో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది-03’ లుక్‌ను సేమ్ టూ సేమ్ కాపీ పేస్ట్ చేసేసినట్లుగా స్పష్టంగా అర్థమైపోతోంది. మాస్టర్ లుక్‌లో నువ్వా-నేనా అని విజయ్ సేతుపతి- విజయ్ లుక్‌.. ఇదిగో పక్కనుండే పిక్‌ను కాస్త పరిశీలించండి అసలు విషయమేంటో మీకే కళ్లకు కట్టినట్లుగా తెలిసిపోతుంది. ఈ రెండు పిక్‌లను పక్క పక్కనెట్టి చూసిన నెటిజన్లు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. మరీ మన సినిమాలను కోలీవుడ్‌ డైరెక్టర్స్ ఈ రేంజ్‌‌లో కాపీ కొట్టేస్తున్నారేంటని నవ్వేసికుంటున్నారు. ఈ కాపీ పేస్ట్ వ్యవహారంపై డైరెక్టర్ లేదా హీరో రియాక్టయ్యి ఎలాంటి వివరణ ఇస్తారో.. లేదా నవ్వుకుంటున్నారుగా అని లైట్ తీసుకుంటారో మరి.

Master Recent look Copied By Telugu Film!

Master Recent look Copied By Telugu Film!
vijay master movie
master
master look
copy
raju gari gadhi-3