‘డిస్కోరాజా’ డిజప్పాయింట్ చేయడు: రవితేజ

Wed 22nd Jan 2020 12:15 AM
discoraja,pre release event,highlights,raviteja,vinayak,anil ravipudi,nabha natesh  ‘డిస్కోరాజా’ డిజప్పాయింట్ చేయడు: రవితేజ
Disco Raja Pre Release Event Highlights ‘డిస్కోరాజా’ డిజప్పాయింట్ చేయడు: రవితేజ
Sponsored links

అతిరథ మహారధుల సమక్షంలో మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్. జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల !!!
మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘డిస్కోరాజా’ సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా డిస్కో రాజా. సినిమా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. వి.ఐ.ఆనంద్ సినిమాను బాగా తీశాడు. వెన్నెల కిషోర్, సునీల్, బాబీ సింహాతో బెస్ట్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ నభా నటేష్, పాయల్, తాన్యా హాప్ బాగా చేశారు. కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని బాగా చేశాడు. నేను చూస్తూ పెరిగిన పాత్రలు ఈ సినిమాలో చేశాను, అందరికి నచ్చుతాయి. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. నిర్మాత రామ్ తాళ్లూరితో చేసిన ఈ రెండో సినిమా నిరుత్సాహ పరచదు. జనవరి 24న మీలాగే నేను ఈ సినిమా కోసం వేచి చూస్తున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ విఐ. ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘నేను బిగ్ స్టార్‌తో చేస్తున్న సినిమా ఇది. రవితేజగారు నా టైగర్ సినిమా చూసి బెస్ట్ విషెస్ తెలిపారు. ఆయన నన్ను, నా మూవీస్‌ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి డైరెక్టర్ రవితేజగారితో సినిమా చేయాలి, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను. కెమెరా, ఆర్ట్, మ్యూజిక్ ఇలా అన్ని ఈ సినిమాకు కుదిరాయి. బాబీ సింహా, పాయల్, నభా నటేష్ మిగిలిన ఆర్టిస్ట్స్ అందరూ బాగా చేశారు. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి..’’ అన్నారు.

సునీల్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తరువాత మంచి సినిమాలో నటించాను. రవితేజగారికి థ్యాంక్స్. కొత్తగా మరియు గొప్పగా ఉండబోతుంది డిస్కోరాజా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు’’ తెలిపారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘సినిమా ట్రైలర్ సూపర్బ్‌గా ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరిగారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. పాయల్, నభాగారికి నా బెస్ట్ విశేష్. రవితేజ గారితో నేను ‘రాజా ది గ్రేట్’ సినిమా తీశాను. మళ్ళీ ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తానా.. అని ఎదురు చూస్తున్నాను. మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత రామ్ తాళ్లూరిగారికి గుడ్ లక్, డైరెక్టర్ ఆనంద్ ఈ సినిమాకు ‘డిస్కోరాజా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. మా బావ రవితేజ ఎనర్జీకి ఎవ్వరూ మ్యాచ్ అవ్వలేరు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఆనంద్‌కు ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. ‘‘నేను రవితేజగారికి పెద్ద అభిమానిని, రవితేజగారి ఎనర్జీ ఈ సినిమాకు పెద్ద అసెట్. ఆయనతో నటించడం మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. డైరెక్టర్ విఐ. ఆనంద్‌గారు చాలా క్రియేటివ్‌గా సినిమా తీశారు. తమన్‌గారి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. నేను అందరిలానే జనవరి 24న విడుదల కాబోయే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను..’’ అన్నారు.

డైరెక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘‘రవితేజకి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఆనంద్ ఈ సినిమాకు డిస్కోరాజా అనే టైటిల్ పెట్టినప్పుడే సక్సెస్ అయ్యారు. విజువల్స్ అన్ని బాగున్నాయి, టీజర్స్, ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సునీల్ , వెన్నెల కిషోర్, బాబీసింహా ఇలా అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

Sponsored links

Disco Raja Pre Release Event Highlights:

Celebrities Speech at Disco Raja Pre Release Event

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019