ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ అందుకున్న అరవింద్!

Tue 21st Jan 2020 02:24 PM
pranab mukherjee,allu aravind,champions of change 2019  ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ అందుకున్న అరవింద్!
Former President of India, Pranab Mukherjee confers ‘Champions of Change 2019’ award to Allu Aravind ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ అందుకున్న అరవింద్!
Sponsored links

ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ను మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన అద్భుతమైన చిత్రాలతో అందరికీ సుపరిచితమే. ఆయన చిత్రాలకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్ తెలుగులో కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో చిత్రాలను నిర్మించారు. రజినీకాంత్, చిరంజీవి, అనిల్ కపూర్, గోవిందా, అమీర్ ఖాన్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో ఆయన చిత్రాలు తీశారు.

తాజాగా అల్లు అరవింద్ సేవలకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఈరోజు (సోమవారం) మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌ను అల్లు అరవింద్‌కు ప్రధానం చేశారు.

 సోషియల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనిటీ సర్వీస్ చేసిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్‌ను ఈ ఏడాది నలుగురు ముఖ్యమంత్రలు, కొంతమంది స్పోర్ట్స్ ఛాంపియన్స్ స్వీకరించబోతున్నారు. వారిలో అల్లు అరవింద్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి కేటగిరీలో ఈ అవార్డ్ అందుకోవడం విశేషం. కె.జీ బాలకృష్ణన్ (ఎక్స్ చీప్ సెక్రటరీ ఆఫ్ ఇండియా), జస్టిస్ గ్యాన్ సుధ మిశ్రా (ఎక్స్ జెడ్జ్ సుప్రీమ్ కోర్ట్)లు.. అల్లు అరవింద్‌కు ఈ అవార్డ్ ఇవ్వడానికి ఎంపిక చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది.
Sponsored links

Former President of India, Pranab Mukherjee confers ‘Champions of Change 2019’ award to Allu Aravind:

Allu Aravind Takes ‘Champions of Change 2019’ Award

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019