‘విరాటపర్వం’లోకి అడుగెట్టిన రానా!

Mon 20th Jan 2020 12:43 PM
hero rana daggubati,virataparvam,movie,kerala,latest,update  ‘విరాటపర్వం’లోకి అడుగెట్టిన రానా!
Rana Joins Virataparvam Shoot In Kerala ‘విరాటపర్వం’లోకి అడుగెట్టిన రానా!
Sponsored links

హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం ‘విరాటపర్వం’ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కొన్ని ప్రధాన సన్నివేశాల్ని దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరిస్తున్నారు. నాయికగా నటిస్తున్న సాయిపల్లవితో పాటు, ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రియమణి సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు.

‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ కీలక పాత్రధారులైన ఈ సినిమాకు డాని సాంచెజ్-లోపెజ్ చాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు.

2020 వేసవిలో ‘విరాటపర్వం’ను విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు.

Sponsored links

Rana Joins Virataparvam Shoot In Kerala:

Virataparvam Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019