‘డిస్కోరాజా’ సైగ చేస్తేనే.. లోకం సాగేది

Disco Raja Movie Rum Pum Bum lyrical Song Released

Fri 17th Jan 2020 01:33 PM
ravi teja,disco raja,movie,rum pum bum,lyrical song,released  ‘డిస్కోరాజా’ సైగ చేస్తేనే.. లోకం సాగేది
Disco Raja Movie Rum Pum Bum lyrical Song Released ‘డిస్కోరాజా’ సైగ చేస్తేనే.. లోకం సాగేది
Advertisement

‘కాలం ఆగాలి.. నా కాలి వేగం చూసి.. లోకం సాగాలి.. నా వేలి సైగే తెలిసి..’ అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆయన నటించిన చిత్రం ‘డిస్కోరాజా’.  ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం’ సినిమాల ఫేమ్ వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జనవరి 24న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను సింగర్ శ్రీకృష్ణతో పాటు హీరో రవితేజ, డిస్కో కింగ్ బప్పీలహరి ఆలపించారు. ఒకప్పుడు తన పాటలతో బప్పీలహరి ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఆయన ఈ చిత్రం కోసం పాట పాడటం విశేషం. 

ఇక హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన థమన్ ఈ పాటకు తనదైన తరహాలో మ్యూజిక్ అందించి మరో ట్రెండీ సాంగ్‌ను ప్రేక్షకులకు అందించారు. ఈ పాట మరో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. జనవరి 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Click Here For Song

Disco Raja Movie Rum Pum Bum lyrical Song Released:

Disco Raja Movie Rum Pum Bum Song Out 


Loading..
Loading..
Loading..
advertisement