‘లవ్‌స్టోరీ’తో చైతూ, సాయిపల్లవి వచ్చేశారు

Tue 14th Jan 2020 09:15 PM
naga chaitanya,sai pallavi,sekhar kammula,new movie,title,love story,poster,release  ‘లవ్‌స్టోరీ’తో చైతూ, సాయిపల్లవి వచ్చేశారు
Love Story Movie Title Poster Released ‘లవ్‌స్టోరీ’తో చైతూ, సాయిపల్లవి వచ్చేశారు
Sponsored links

‘లవ్ స్టోరీ’ తో మ్యాజిక్ చేయబోతున్న శేఖర్ కమ్ముల, సంక్రాంతి  శుభాకాంక్షలతో ‘టైటిల్ పోస్టర్’ విడుదల

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి ‘లవ్ స్టోరీ’ అనే పేరును ఖరారు చేసారు శేఖర్ కమ్ముల.  హీరో, హీరోయిన్స్ కలసి ఉన్న పోస్టర్ కి చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ఒక ఇంటెన్సిటీ ఉన్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రేమలో కనిపించే భావోద్వేగాలను పోస్టర్ లో పలికించాడు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ తో కలిగించారు శేఖర్ కమ్ముల. పోస్టర్ తో కథను పరిచయం చేయడంలో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. 

నాగచైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబోకి తగ్గ లుక్ ని విడుదల చేసింది యూనిట్. రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న ‘పవన్’ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది. ఈ చిత్రానికి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ పండుగ తర్వాత ప్రారంభం అవుతుంది. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది.

ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆర్ట్: రాజీవ్ నాయర్

సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్

సహా నిర్మాత : విజయ్ భాస్కర్, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా

డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల

మ్యూజిక్ : పవన్

నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు

రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల

Sponsored links

Love Story Movie Title Poster Released:

Sekhar Kammula New Movie Love Story Title Poster

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019