బొంబాట్ నుంచి ‘ఇష్క్ కియా..’ సాంగ్ విడుదల

Tue 14th Jan 2020 09:09 PM
ss thaman,bombhaat,movie,ishq kia,song,release  బొంబాట్ నుంచి ‘ఇష్క్ కియా..’ సాంగ్ విడుదల
SS Thaman Released Bombhaat Movie Song బొంబాట్ నుంచి ‘ఇష్క్ కియా..’ సాంగ్ విడుదల
Sponsored links

బొంబాట్‌లో ‘ఇష్క్ కియా...’ సాంగ్‌ను విడుద‌ల చేసిన మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే

కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని

పెద‌వికే తెల‌ప‌ని ప‌లికె నీ పేరునే ప్రియ‌త‌మా.. ఓ ప్రియ‌త‌మా

లోక‌మే ఆన‌దు మైక‌మే వీడ‌దు.. తెలుసునా ఇది ప్రేమేన‌ని

ఎందుకిలా ఓ ఎందుకిలా..... ఇష్క్ కియా అంటూ త‌న ప్రేమ‌ను హీరోయిన్ హీరోకు వ్య‌క్తం చేస్తే ఎలా ఉంటుంది? ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందం చూసేయాలంటే ‘బొంబాట్‌’ సినిమా చూసేయాల్సిందే.

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తోన్న‌ చిత్రం ‘బొంబాట్’. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. పాట విన‌డానికి అహ్లాదంగా ఉంద‌ని చిత్ర యూనిట్‌ను త‌మ‌న్ అభినందించారు.

రామాంజ‌నేయులు రాసిన ఈ పాట‌ను సునీతా సార‌థి శ్రావ్యంగా ఆల‌పించారు. హీరో సుశాంత్‌, సిమ్రాన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీ ఇది. లిరిక‌ల్ వీడియోలో చూపించిన కొన్ని విజువ‌ల్స్ క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ప్రేయ‌సి త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను ప్రేమికుడికి ఎంత అందంగా చెప్పింద‌నే స‌న్నివేశంలో వ‌చ్చే పాట ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అంటున్నారు.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్  చేస్తున్నారు.

Sponsored links

SS Thaman Released Bombhaat Movie Song:

Bombhaat Movie Ishq kia Song Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019