ఆ విషయంలో పవన్‌‌పై ఫాన్స్ తీవ్ర అసంతృప్తి!!

Sun 15th Dec 2019 12:17 PM
pawan,pawan kalyan,janasena,pink remake,dil raju,pawan fans  ఆ విషయంలో పవన్‌‌పై ఫాన్స్ తీవ్ర అసంతృప్తి!!
Pawan Fans Un Happy With Janasena Behaviour! ఆ విషయంలో పవన్‌‌పై ఫాన్స్ తీవ్ర అసంతృప్తి!!
Sponsored links

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. జనసేన ఏకైకన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్‌తో తిరుగుటు చేస్తుండగా.. మరోవైపు కీలక నేతలంతా టాటా చెప్పేస్తున్నారు. మరోపక్క పవన్ ‘పింక్’ రీమేక్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అధికారికంగా పవన్ కళ్యాణ్ లేకుండా ‘పింక్’ రీమేక్ దిల్ రాజు బ్యానర్‌లో మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా..? అని నిన్నమొన్నటివరకు తెగ ఎదురు చూసిన అయన అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా మొదలైనా సోషల్ మీడియాలో హడావిడి చెయ్యకుండా కామ్ అయ్యారు.

కారణం పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ చెయ్యడం వారికీ బొత్తిగా నచ్చడం లేదట. ‘పింక్’ సినిమాలో హీరో ఎలివేషన్‌కి అనువుగా లేని స్క్రిప్ట్ అది. పింక్ మూవీ పూర్తిగా సోషల్ కాన్సెప్ట్ కలిగిన కథ. అయితే దిల్ రాజు ఆధ్వర్యంలో వేణు శ్రీరామ్.. పవన్ కోసం స్క్రిప్ట్‌లో చాలా అంటే హీరోయిజం చూపించే విధంగా కొన్ని మార్పులు చేసినప్పటికీ.... పవన్ ఇమేజ్‌కి ‘పింక్’ రీమేక్ సరిపోదని పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అసహనంగా వారు సోషల్ మీడియాలో సందడి చెయ్యకుండా కామ్ అయ్యారు. మరి పవన్ సినిమా మొదలైయింది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు హడవిడి చూడడానికి రెండు కళ్ళు చాలేవి కావు.

Sponsored links

Pawan Fans Un Happy With Janasena Behaviour!:

Pawan Fans Un Happy With Janasena Behaviour!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019