ఆ నిర్మాత అంటే హీరోలు భయపడుతున్నారా?

Tollywood Heros Fear About Top Producer.. Here Details!

Sat 14th Dec 2019 04:04 PM
tollywood heros,pvp cinemas,producer pvp,tpllywood movies  ఆ నిర్మాత అంటే హీరోలు భయపడుతున్నారా?
Tollywood Heros Fear About Top Producer.. Here Details! ఆ నిర్మాత అంటే హీరోలు భయపడుతున్నారా?
Advertisement

టాలీవుడ్‌లో చాలామంది యంగ్ హీరోలకు దిల్ రాజుతో సినిమా అంటే యమా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక బడా హీరోలు మీడియం నిర్మాతలకి దొరకరు. వారికీ హారిక హాసిని, 14 రీల్స్, సితార, మైత్రి మూవీస్ లాంటి బడా నిర్మాణ సంస్థలు బడాహీరోలను గ్రిప్‌లో పెట్టుకుంటాయి. ఇక ఈ నిర్మాణ సంస్థలు కథలు డిమాండ్ చేస్తే చిన్న హీరోలకు ఫైనాన్స్ చేస్తాయి. అయితే దర్శకుడికి హీరోకి మధ్య వారధిలా నిర్మాత పనిచేస్తాడు. ఆ నిర్మాతతోనే హీరోకి సమస్యలొస్తే.. ఇక ఆ నిర్మాతలను దూరం పెట్టడానికి ఏ హీరో వెనకాడరు. ఇప్పుడు టాలీవుడ్ పీవీపీ పని అలానే ఉంది. మహేష్‌తో, నాగార్జునతో అడవి శేష్‌తో సినిమాలు నిర్మించిన పీవీపీ అంటే ఇప్పుడు హీరోలు భయపడుతున్నారు.

చాలామంది నిర్మాతలు హీరోలకు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంటారు. వారి మధ్యన సినిమా కుదరకపోతే ఆ అడ్వాన్స్‌లు హీరోలు నిర్మాతలకు వెనక్కి ఇచ్చేస్తారు. కానీ పీవీపీ మాత్రం తన అడ్వాన్స్ వెనక్కి తీసుకోరు.. ఆ హీరో నాకు సినిమా చెయ్యాల్సిందే అంటూ కోర్టు మెట్లెక్కేస్తాడు. మహేష్ లాంటోడిని ముప్పుతిప్పలు పెట్టాడు పీవీపీ. ఇటు ఫైనాన్స్ చేసే పీవీపీ దగ్గరకు ఫైనాన్స్ కోసం నిర్మాతలెవరు రావడం లేదు. ఇక రాజకీయాల్లోనూ పీవీపీ జీరో. తాజాగా ఏ హీరో నైనా పట్టుకుని సినిమా చేద్దామంటే... పీవీపీకి హీరో దొరకడం లేదు. హీరోలంతా ఆయనతో మనకెందుకులే అని లైట్ తీసుకోవడంతో... పీవీపీ నిర్మాణ సంస్థ ఇప్పుడు మూతబడక తప్పదనేలా ఉంది.

Tollywood Heros Fear About Top Producer.. Here Details!:

Tollywood Heros Fear About Top Producer.. Here Details!  


Loading..
Loading..
Loading..
advertisement