‘సూర్యుడివో చంద్రుడివో..’ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్‌!

Wed 11th Dec 2019 01:41 PM
mahesh babu,vijayashanthi,sarileru neekevvaru,second song,top place  ‘సూర్యుడివో చంద్రుడివో..’ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్‌!
Sarileru Neekevvaru Second song Trending in Top Place ‘సూర్యుడివో చంద్రుడివో..’ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్‌!
Sponsored links

శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్ నెం1 స్థానంలో ట్రెండింగ్ అవుతున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సెకండ్ సింగిల్ ‘సూర్యుడివో చంద్రుడివో’..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి రానున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సాంగ్‌ మైండ్‌ బ్లాక్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా అంద‌రూ ఎదురు చూస్తున్న సెకండ్‌ సాంగ్ సోమవారం సాయంత్రం 5:04 కి విడుదలైంది. ‘సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో... సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో’ అనే పల్లవితో సాగే ఈ పాట శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటూ రికార్డ్ వ్యూస్ సాధించి ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఫ్రెష్‌ మెలోడి ట్యూన్‌కి రామజోగయ్య శాస్త్రి హృదయానికి హత్తుకునే భావాత్మక సాహిత్యం అందించారు. ప్రముఖ పంజాబీ సింగర్‌, కంపోజర్ బి. ప్రాక్‌ దీన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించారు.

‘సూర్యుడివో చంద్రుడివో’ పాటతో ఆల్‌ మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌, సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌ గా ‘సరిలేరు నీకెవ్వరు’ ఉండబోతోంది అని తెలుస్తోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్యారక్టరైజేషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానుంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sponsored links

Sarileru Neekevvaru Second song Trending in Top Place:

Sarileru Neekevvaru Second song Creates Sensation  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019