‘ఆది గురువు అమ్మ‌’ ట్రైల‌ర్ విడుద‌ల

Tue 10th Dec 2019 09:53 PM
v. vijayendra prasad,adi guruvu amma,trailer,release  ‘ఆది గురువు అమ్మ‌’ ట్రైల‌ర్ విడుద‌ల
Adi Guruvu Amma Trailer Released ‘ఆది గురువు అమ్మ‌’ ట్రైల‌ర్ విడుద‌ల
Sponsored links

డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రి, తేజ రెడ్డి, ‘సుర‌భి’ ప్ర‌భావతి, వేమూరి శ‌శి, గోప‌రాజు విజ‌య్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ‘ఆది గురువు అమ్మ‌’. ఇళ‌య‌రాజా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రి ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా....

వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ - ‘‘దైవ స‌మానులుగా భావించే త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను వెల‌క‌ట్ట‌లేం. త‌ల్లి త‌న వారిపై చూపించే ప్రేమ చాలా గొప్ప‌ది. ఆమె తొలి గురువుగా బిడ్డ‌కు అన్నీ తానై నేర్పిస్తుంది. అలాంటి అమ్మ‌పై రూపొందిన ‘ఆది గురువు అమ్మ‌’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం సంతోషంగా ఉంది. ట్రైల‌ర్ చాలా బావుంది. అమ్మ ప్రేమ‌లోని గొప్ప‌త‌నాన్ని చూపించే చిత్ర‌మిది. డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రిగారు మంచి న‌టుడు. ప‌లు చిత్రాల్లో న‌టించారు. ఆయ‌నే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తూ నిర్మించిన ఈ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత డాక్ట‌ర్ ఎం.ఎస్‌.చౌద‌రి మాట్లాడుతూ - ‘‘అమ్మ గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా చాలా సినిమాలు వ‌చ్చాయి. అమ్మ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆమె ప్రేమ గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా రూపొందించిన సినిమా ‘ఆది గురువు అమ్మ‌’. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ గారికి థ్యాంక్స్‌. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు. 

Sponsored links

Adi Guruvu Amma Trailer Released:

V. Vijayendra Prasad Released Adi Guruvu Amma Trailer

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019