‘ఎం3’ చిత్ర ద‌ర్శ‌కుడి కొత్త చిత్రం ‘కోడి కత్తి’

Sun 08th Dec 2019 02:11 PM
kodi kathi,m3 director,next film  ‘ఎం3’ చిత్ర ద‌ర్శ‌కుడి కొత్త చిత్రం ‘కోడి కత్తి’
Kodi Kathi is the M3 Director’s Next Film ‘ఎం3’ చిత్ర ద‌ర్శ‌కుడి కొత్త చిత్రం ‘కోడి కత్తి’
Sponsored links

‘ఎం3’ చిత్ర ద‌ర్శ‌కుడు రామ్ కృష్ణ తోట దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమా ‘కోడి కత్తి’!!

రామ్ కృష్ణ తోట  దర్శకత్వంలో రూపొందిన  సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఎం3’. (మ్యాన్‌ మ్యాడ్‌ మనీ అనేది క్యాప్షన్‌). ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్ కి  మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ చిత్రం విడుదల దశలో ఉండగానే మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్‌ చేశారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు  రామ్ కృష్ణ తోట మాట్లాడుతూ - ‘‘సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ‘ఎం3’ చిత్రం రూపొందింది.  తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌, కొత్త తరహా సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను రూపొందించాం. ‘ఎం3’ చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. ఇక ద‌ర్శ‌కుడిగా నా నెక్స్ట్ ప్రాజెక్ట్  ‘కోడి కత్తి’. నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కె. శరత్ వర్మ పనిచేస్తున్నారు.  న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.

Sponsored links

Kodi Kathi is the M3 Director’s Next Film:

Movie on Kodi Kathi.. with Real Incidents

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019