‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’కు లైన్ క్లియర్

Sun 08th Dec 2019 02:04 PM
amma rajyam lo kadapa biddalu,release date,fixed  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’కు లైన్ క్లియర్
Line Clear to Amma Rajyam Lo Kadapa Biddalu ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’కు లైన్ క్లియర్
Sponsored links

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సెన్సార్ పూర్తి...ఈ నెల 12న విడుదల 

రాంగోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. రాంగోపాల్ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు  రివైజింగ్ కమిటీలో పూర్తి చేసుకుంది. యు/ఎ  సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 12న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్బంగా సెన్సార్ రివైజింగ్ కమిటీకి చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు, విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందేనని తెలిపింది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం చేయలేదని... ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపధ్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్పష్టం చేసింది. ఇందులోని పాటలు ఏ పాటకు ఆ పాట హైలెట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి.శ్రీధర్. 

Sponsored links

Line Clear to Amma Rajyam Lo Kadapa Biddalu:

Amma Rajyam Lo Kadapa Biddalu Release Date Fixed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019