Advertisementt

చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో.. మహేశ్ ఒప్పుకుంటాడా!

Sat 07th Dec 2019 10:07 AM
sarileru neekevvaru,pre release funtion,chief guest,mega hero,ktr  చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో.. మహేశ్ ఒప్పుకుంటాడా!
Sarileru Neekevvaru Cinema Units Plans Pre Release Funtion.. Chief Guest Details Here.. చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో.. మహేశ్ ఒప్పుకుంటాడా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్‌స్టార మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. 2020 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ఇంతవరకూ ప్రమోషన్ చేసిన దాఖలాల్లేవ్. అప్పుడప్పుడు సింగిల్ అంటూ చిన్నపాటి లుక్స్ తప్ప చిత్రబృందం చేసిందేమీ లేదు. ఈ మధ్యే టీజర్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. అటు యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేస్తూ.. ఇటు మహేశ్ అభిమానుల ఆదరాభిమానులు పొందింది. ఆ తర్వాత ప్రతీ మండే.. ఓ సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇక అసలు విషయానికొస్తే... ఒక్కొ సాంగ్‌ లెక్కన రిలీజ్ చేస్తే డిసెంబర్ 30న ఫైనల్ పాట రానుంది. అయితే జనవరి 11న సినిమా రిలీజ్ కానుండటంతో జనవరి 05న ప్రీ రీలజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ వేడుకకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం లేదా.. ఎన్టీఆర్‌ స్డేడియంను ఫిక్స్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవర్ని పిలవాలా..? అనే ఆలోచనలో పడిందట చిత్రబృందం. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఆహ్వానించాలని భావించారట. అయితే కేటీఆర్ మాత్రం ఇప్పట్లో రావడం కష్టమని..‘ సారీ మహేశ్.. మీరు అనుకున్న డేట్‌లో నేను బిజీగా ఉంటాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు తలసాని మాత్రం రావడానికి సిద్ధంగానే ఉన్నారట.

ఇదిలా ఉంటే.. ఓ స్టార్ హీరో ఫంక్షన్‌కు మరో టాప్ హీరో రావడం ‘భరత్ అనే నేను..’ మహేశ్ సినిమా జూనియర్లలో ప్రారంభమైంది. అయితే టాలీవుడ్‌ నుంచి ఎవరైనా టాప్ హీరోను పిలిస్తే బాగుంటుందని భావించిన చిత్రబృందం మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే చీఫ్ గెస్ట్‌గా రావడానికి చెర్రీ ఒప్పుకుంటాడా లేదా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి హీరోల రీల్ లైఫ్‌ వేరు.. రియల్ లైఫ్ వేరు.. ఇగో ప్రాబ్లమ్స్ గట్టిగానే ఉంటాయన్నది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా ఇది అక్షరాలా నిజం. మరి దర్శకనిర్మాతలు మాత్రం చెర్రీని పిలవాలని అనుకుంటున్నారు.. మహేశ్ మనసులో ఏముందో ఏంటో.. అసలు ఆయన ఒప్పుకుంటాడో..? లేదో..? ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చినంతవరకూ వేచి చూడాల్సిందే..! 

Sarileru Neekevvaru Cinema Units Plans Pre Release Funtion.. Chief Guest Details Here..:

Sarileru Neekevvaru Cinema Units Plans Pre Release Funtion.. Chief Guest Details Here..  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ