జబర్థస్త్ కమెడియన్స్‌ని బెదిరిస్తున్నారట!

Sat 07th Dec 2019 04:51 PM
nagababu,jabardasth,comments  జబర్థస్త్ కమెడియన్స్‌ని బెదిరిస్తున్నారట!
Nagababu Sensational Comments on Jabardasth జబర్థస్త్ కమెడియన్స్‌ని బెదిరిస్తున్నారట!
Sponsored links

జబర్దస్త్ పై కామెంట్స్ చేస్తున్న నాగబాబు. జబర్దస్త్ నుండి బయటికెళ్ళాక మళ్ళీ జబర్దస్త్ గురించి కెలుకుతున్న నాగబాబు ఇప్పుడు మల్లెమాల టివి జబర్దస్త్ కమెడియన్స్ ని బెదిరిస్తుందని చెబుతున్నాడు. జబర్దస్త్ సక్సెస్ కి కారణం కేవలం నితిన్ - భరత్ లే అని పాత పాటే పాడుతున్నాడు. వారు జబర్దస్త్ ని వీడిన తర్వాత జబర్దస్త్ కి కళ పోయిందంటున్నాడు, క్రియేటివ్ మైండ్ ఉన్న, టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేయాలని మల్లెమాల టీం చూసిందని, అందులో భాగంగానే నితిన్ - భరత్ లను నడి రోడ్డు మీద నిలబెట్టారని చెబుతున్నాడు నాగబాబు.

వాళ్ళనలా అన్యాయం చేసినందుకే నేను కూడా వాళ్లతో బయటికి రావాల్సి వచ్చిందని, వాళ్ళని ఏదైనా ఛానల్ లో కొత్త షో పెట్టండి మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పానని.. ఆది, అనసూయ లాంటి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసారని, అలాగే నాతో పాటుగా చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్ బయటికి వచ్చేసినా. ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వాళ్ళు జబర్దస్త్ ని వదలకుండా అగ్రిమెంట్ అంటూ మల్లెమాల బెదిరించడం వలనే వాళ్ళు బయటికి రావడం లేదని సంచలన విషయాలు జబర్దస్త్ గురించి నాగబాబు బయటపెట్టాడు. అసలు జబర్దస్త్ కామెడీ షోలో చాలా రాజకీయాలు నడుస్తున్నాయని, అక్కడ జరిగే రాజకీయాలన్నీ నాకు తెలుసని, ఆ చెత్త జబర్దస్త్ రాజకీయాల వలన చాలామంది నష్టపోయారని చెప్పి జబర్దస్త్ మీద మొదట పాజిటివ్ గా మాట్లాడిన నాగబాబు.. చివరి ఎపిసోడ్ లో మాత్రం జబర్దస్త్ ని కడిగిపారేసాడు.

Sponsored links

Nagababu Sensational Comments on Jabardasth:

Nagababu About Jabardasth

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019