ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Top Actress Green Signal To Rana Movie

రానాకు హీరోయిన్ దొరికేసిందోచ్!

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ కొరియన్ సినిమా రీమేక్‌లో నటించేందుకు టాప్ హీరో రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడితో తెరకెక్కించేందుకు రానా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక నిర్మాతగా రానానే వ్యవహారించనున్నాడు. అయితే ఇక మిగిలిందల్లా రానాతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నదే.. ఇప్పటికే కీర్తి సురేష్‌ను సంప్రదించగా కథ విన్న ఆ భామ రెడ్ సిగ్నల్ ఇచ్చిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయ్. మరోవైపు నయనతార అడిగినప్పటికీ ఆమె డేట్స్ ఖాళీలేవ్.. ఇప్పట్లో కుదరదని చెప్పేసిందట.

అయితే ఫైనల్‌గా కాజల్ అగర్వాల్‌‌ను సంప్రదించగా ఏ మాత్రం ఆలోచించకుండా నేను రె‘ఢీ’ అని చెప్పేసిందట. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటించి మెప్పించారు. సినిమా కూడా బాగానే ఆడింది. అందుకే కాజల్ అయితే బాగుంటుందని రానా ఫిక్సయ్యాడట. కాగా ఈ సినిమాలో కాజల్ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రానా డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడట... ఈమె ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటుందట. సో.. ఎట్టకేలకు రానాకు హీరోయిన్ దొరికేసిందన్న మాట.

కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా అప్పటికీ ఇప్పటికీ కాజల్ అందం.. అభినయం ఏ మాత్రం తగ్గలేదు. ఎలాంటి పాత్రలో అయిన ఒదిగిపోతుంటుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సీనియర్, జూనియర్ హీరోలతో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్‌లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా.. ‘భారతీయుడు 2’ సినిమాతో పాటు మంచు విష్ణుతో కలిసి ఓ సినిమా చేస్తూ బిజిబిజీగా గడుపుతోంది. మరి తాజాగా పోలీసు పాత్రలో కాజల్ అని వస్తున్న వార్తలపై ఆ ముద్దుగుమ్మ ఏ మాత్రం రియాక్ట్ అవుతుందో.. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.

Top Actress Green Signal To Rana Movie

Top Actress Green Signal To Rana Movie
daggubati rana
rana new movie
kajal aggarwal
police offier