ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> South Hot Actress joins BJP.. in presence JP Nadda

బీజేపీ తీర్థం పుచ్చుకున్న అందాల హాట్ భామ

2014 ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా బీజేపీ తప్ప మరో పార్టీ ఉండకూడదని భావించిన కమలనాథులు ఆ దిశగా అడుగులేస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో చాలా డల్‌గా ఉన్న బీజేపీని బలోపేతం చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘ఆపరేషన్ కమల్’కు తెరలేపిన బీజేపీ.. ఇతర పార్టీల్లోని ముఖ్యులు, కీలక నేతలు, మాజీలు, ద్వితియ శ్రేణి నాయకులను చేర్చుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు.. మరీ ముఖ్యంగా సినిమా నటీనటులు, బిజినెస్‌మెన్‌లను సైతం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించేసి కండువాలు కప్పేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకు పలువురు సినీ నటులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

తాజాగా.. ‘ఆపరేషన్ చెన్నై’కి తెరలేపిన బీజేపీ పెద్దలు సెలబ్రిటీలను పార్టీలోకి చేర్చుకుని కండువాలు కప్పే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం నాడు కోలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందు వరుసలో ఉండే రాధా రవి కాషాయ కండువా కప్పుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. రాధాకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా.. ఈయన సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అదృష్టాన్ని పరిశీలించుకోవాలని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఈయన డీఎంకేలో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా శనివారం సాయంత్రం.. అటు కోలీవుడ్‌లో.. ఇటు బాలీవుడ్‌ తన అందచెందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన హాట్ భామ నమిత కూడా బీజేపీలో చేరింది. చెన్నైలో జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకుంది. ఆమెతో పాటు భర్త వీరేంద్ర చౌదరి కూడా కండువా కప్పుకున్నాడు. కాగా.. అందాలు ఆరబోయడంలో ఈ ముద్దుగుమ్మ తర్వాత ఎవరైనా అని కుర్రకారు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు నటించమంటే జీవించేస్తుంది కూడా. అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్ల కిందటే పెళ్లి చేసుకున్న నమిత సినిమాలకు పూర్తిగా దూరమైంది. రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్న ఈ భామ కోరిక ఏ మాత్రం నెరవేరుతుందో వేచి చూడాల్సిందే మరి. కాగా ఇప్పటికే చాలా వరకు కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు వివిధ పార్టీల్లో చేరగా.. విలక్షణ నటుడు పార్టీ స్థాపించగా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో పార్టీ స్థాపించాలని సన్నాహాలు చేస్తున్నారు.

South Hot Actress joins BJP.. in presence JP Nadda

South Hot Actress joins BJP.. in presence JP Nadda
south india hot actress
namitha
bjp
jp nadda
kollywood
chennai