‘క్షీరసాగరమథనం’ ఫస్ట్ లుక్ విడుదల

‘క్షీరసాగరమథనం’ అనే అచ్చ తెలుగు పేరుతో రూపొందిన చిత్రం మెల్లగా సందడి చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్ర టైటిల్‌ను విడుదల చేయగా- ఇప్పుడు తాజాగా... వరుస విజయాలతో దూసుకుపోతున్న మరో యువ కథానాయకుడు అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వరకు పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్‌లా.. సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే వజ్ర సంకల్పం కలిగిన ఐ.టి.రంగ నిపుణులు అనిల్ పంగులూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుండెల్నిమెలిపెట్టే గాఢమైన అనుభూతుల్నిపంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందించనున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ‘క్షీరసాగరమథనం’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి అభినందించిన అడివి శేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు
ఝలక్, గ్రీన్ సిగ్నల్, ప్రేమికుడు, సోడా గోలిసోడా వంటి చిత్రాలలో హీరోగా నటించి తన ప్రతిభను ప్రకటించుకున్న మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షిత సొనవనే హీరోయిన్. ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు.
చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, గౌతమ్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.
Ksheera Sagara Madhanam First Look Released
Adivi Sesh Launches Ksheera Sagara Madhanam First Look







































