అందమైన భామల ప్రేమకథ ‘రూపం S20 ప్లస్’

Sat 23rd Nov 2019 10:31 AM
roopam s 20 plus,movie,release,novembar 28  అందమైన భామల ప్రేమకథ ‘రూపం S20 ప్లస్’
Roopam S 20 Plus Movie Release Date Fixed అందమైన భామల ప్రేమకథ ‘రూపం S20 ప్లస్’
Sponsored links

అందమైన అమ్మాయిల ప్రేమ కథ  ‘రూపం యస్ 20 ప్లస్’ నవంబర్ 28 న విడుదల...                                                సాయి లోకేష్ ప్రొడక్షన్ పతాకంపై సాయి తులసి సమర్పణలో చక్రవర్తి, బంగారాజు, అక్షర, సంతోషిణి హీరో హీరోయిన్లుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో సి.రామాంజనేయ నిర్మిస్తున్న అందమైన అమ్మాయిల ప్రేమ కథ చిత్రం ‘రూపం యస్ 20 ప్లస్’ ఈ  నవంబర్ 28 న ప్రేక్షకులముందుకు వస్తుంది.

దర్శకుడు వెల్లంకి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ... అందమైన అమ్మాయిలను చూస్తే ప్రతి మగాడికి ప్రేమ కలుగుతుంది, ఎలాగైనా ట్రాప్ లో పడేయాలని చూస్తారు, ఒప్పుకోకపోతే బలవంతంగానైనా కోరిక తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఇలాగే మా చిత్రంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని ఎలా పాడు చేసారు, ఆమె వాళ్ల నుండి ఏ విధంగా తప్పించుకుంది, మంచి మనిషికి దగ్గరై అతని ప్రేమను ఎలా పొందింది అన్నది ఒక జంట కథగా, ఒక పోలీస్ ఆఫీసర్ అందమైన అమ్మాయి ప్రేమలోపడి పెళ్లిచేసుకొన్నాడు.. మాఫియా వలలో చిక్కుకొన్న తన భార్యను ఎలా కాపాడుకొన్నాడన్నది రెండో జంట కథ. ఈ రెండు జంటల కథను అనేక మలుపులు తిప్పుతూ అద్భుతమైన స్కీన్ ప్లేతో రూపొందించానన్నారు.                                                                                                                                                                                                                                      నిర్మాత  సి.రామాంజనేయ  మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు ఉన్నాయని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్ది నవంబర్ 28 న విడుదల చేస్తున్నామన్నారు.                                                                         

ఇంకా ఈ చిత్రంలో ఉమామహేశ్వరి, రజనీకాంత్, అజయ్, రజని, సరోజని నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సాగర్, ఆనంద్, సంగీతం : మెలోడీ శ్రీనివాస్, ఆర్ ఆర్ అర్మాన్, పాటలు : వెల్లంకి విజయలక్ష్మి , ఫైట్స్ : లంక సాంభశివరావు, ఎడిటింగ్ : వెంకటేశ్వర్లు, కథ, మాటలు, నిర్మాత : సి.రామాంజనేయ, స్కీన్ ప్లే, దర్శకత్వం : వెల్లంకి దుర్గాప్రసాద్

Sponsored links

Roopam S 20 Plus Movie Release Date Fixed:

Roopam S 20 Plus Movie Release on Nov 28th

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019