శ్రీనివాస‌రెడ్డిని అభినందించిన ద‌ర్శ‌కధీరుడు

Sat 23rd Nov 2019 10:47 AM
ss rajamouli,wishes,comedian,srinivas reddy,bhagyanagara veedhullo gammattu,movie  శ్రీనివాస‌రెడ్డిని అభినందించిన ద‌ర్శ‌కధీరుడు
SS Rajamouli Praises Comedian Srinivas Reddy శ్రీనివాస‌రెడ్డిని అభినందించిన ద‌ర్శ‌కధీరుడు
Sponsored links

శ్రీనివాస‌రెడ్డిని అభినందించిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు’. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ చాలా బావుందంటూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి స‌హా ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. ఇప్పుడు దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈ చిత్రంతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్న శ్రీనివాస‌రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.

‘‘నేను కెరీర్‌ను స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి శ్రీనివాస‌రెడ్డి నాకు తెలుసు. త‌ను మంచి క‌మెడియ‌న్‌. తొలిసారి ‘భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు’ సినిమాతో ద‌ర్శ‌క నిర్మాత‌గా ప‌రిచయం అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస‌రెడ్డికి అభినంద‌న‌లు తెలుపుతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల మెగాప్రిన్స్‌ వ‌రుణ్‌తేజ్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్ 6న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ ర‌చ‌యిత ప‌రం సూర్యాన్షు ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేను అందించారు.

Sponsored links

SS Rajamouli Praises Comedian Srinivas Reddy:

SS Rajamouli wishes to Comedian Srinivas Reddy

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019