టీజర్‌లో మహేష్ యాటిట్యూడ్ అదిరిందంట!

Fri 22nd Nov 2019 02:43 PM
sarileru neekevvaru,teaser,release,date fix  టీజర్‌లో మహేష్ యాటిట్యూడ్ అదిరిందంట!
Sarileru Neekevvaru Teaser Talk Out టీజర్‌లో మహేష్ యాటిట్యూడ్ అదిరిందంట!
Sponsored links

మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు టీజర్ కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రేపు ఈ పాటికి సామాజిక మాధ్యమాల్లో సరిలేరు నీకెవ్వరు టీజర్ హోరెత్తడం ఖాయంగా కనబడుతుంది. మాములుగా మహేష్ సినిమా టీజర్ అంటే మహేష్ అభిమానులకి ఎంతో ఆత్రుత ఉంటుంది. కానీ ఇప్పుడు మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో పోటీ అనేసరికి సదరు ప్రేక్షకుడు కూడా సరిలేరు నీకెవ్వరు టీజర్ పై ఆసక్తి చూపుతున్నారు. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి మహేష్ ని ఎలా చూపించబోతున్నాడా అంటూ మహేష్ ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాలో ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. టీజర్ వదలగానే లైక్స్, వ్యూస్ కోసం ఇప్పటికే రంగం సిద్ధం చేశారు మహేష్ ఫ్యాన్స్.

అయితే అనిల్ రావిపూడి, మహేష్ సరిలేరు నీకెవ్వరు టీజర్ ని ఎలా కట్ చేసాడో కానీ.. ఆ టీజర్ లో మహేష్ యాటిట్యూడ్ అండ్ డైలాగ్ డెలివరీ హైలెట్ గా ఉంటుందని, విలన్స్ ముందు మహేష్ హీరోయిజం టీజర్ కే హైలెట్ అంటూ ఓ న్యూస్ బయటికొచ్చింది. మహేష్ తన స్టయిల్ అండ్ యాటిట్యూడ్ తో విలన్స్ పని పట్టే సీన్స్ ని స్పెషల్ గా టీజర్ లో కట్ చేసారని టాక్. మరి సరిలేరు నీకెవ్వరు కథ కూడా ఓ మిలట్రీ నేపథ్యంలో మొదలై ట్రైన్ ఎపిసోడ్ తో సాగుతూ.... ఫైనల్ గా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద పొలిటీషియన్ విజయశాంతితో మహేష్ డైరెక్టుగా తలపడడంతో ఆగుతుందని సోషల్ మీడియా కథనం. మరి మహేష్ తో అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చెయ్యబోతున్నాడో చూడాలి. 

Sponsored links

Sarileru Neekevvaru Teaser Talk Out:

Sarileru Neekevvaru Teaser Release Date fix

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019