రవితేజ ‘క్రాక్’ షూటింగ్ మొదలైంది

Fri 22nd Nov 2019 02:02 PM
raviteja,shruti haasan,krack,movie,latest,update  రవితేజ ‘క్రాక్’ షూటింగ్ మొదలైంది
Raviteja Krack Movie Shooting Started రవితేజ ‘క్రాక్’ షూటింగ్ మొదలైంది
Sponsored links

రామోజీ ఫిలింసిటీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, గోపీచంద్ మ‌లినేని, ఠాగూర్ మ‌ధుల ‘క్రాక్‌’ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి రెండు సెన్సేష‌న‌ల్ హిట్‌ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్‌’. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌, ర‌వితేజ మాస్ లుక్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైంది. ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.

కోలీవుడ్ యాక్ట‌ర్స్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘మెర్స‌ల్‌’, ‘బిగిల్‌’ వంటి సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందించిన జి.కె.విష్ణు సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని

నిర్మాత‌:  బి.మ‌ధు

బ్యాన‌ర్‌:  స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్‌

సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె.విష్ణు

డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా

కో ప్రొడ్యూస‌ర్‌:  అమ్మిరాజు కానుమిల్లి

ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి

ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌

ఫైట్స్‌:  రామ్ ల‌క్ష్మ‌ణ్‌

పాట‌లు:  రామ‌జోగ‌య్య‌శాస్త్రి

మేక‌ప్‌:  శ్రీనివాస‌రాజు

కాస్ట్యూమ్స్‌: శ‌్వేత‌, నీర‌జ కోన‌

స్టిల్స్‌:  సాయి

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

ప‌బ్లిసిటీ డిజైన్‌:  వ‌ర్కింగ్ టైటిల్ శివ‌

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  కోట‌ప‌ల్లి ముర‌ళీకృష్ణ‌

కో డైరెక్ట‌ర్స్‌:  గులాబి శ్రీను, నిమ్మ‌గడ్డ శ్రీకాంత్‌

చీఫ్ కో డైరెక్ట‌ర్‌:  పీవీవీ సోమ‌రాజు

Sponsored links

Raviteja Krack Movie Shooting Started:

Raviteja, Shruti Haasan Krack Movie Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019