స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ!

Tue 19th Nov 2019 02:37 PM
ismart beauty,nidhi agarwal,special song,romantic song   స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ!
Ismart Beauty Nidhi Agarwal In Special Song స్పెషల్ సాంగ్‌లో నర్తించనున్న ‘ఇస్మార్ట్’ బ్యూటీ!
Sponsored links

‘ఇస్మార్ట్ శంకర్‌’ మూవీతో నిధి అగర్వాల్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి గుర్తింపే కాకుండా.. ఫాలోయింగ్ కూడా గట్టిగానే సంపాదించుకుంది. అలా టాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ ముద్దుగమ్మకు తాజాగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా పరిచయం అవుతున్న చిత్రంలో నటించే అవకాశం దక్కిన విషయంలో తెలిసిందే. ఈ సినిమాలో నటించేందుకుగాను అక్షరాలా కోటి 25 లక్షలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా మరోసారి ఈ బ్యూటీ గోవా హాట్ టాపిక్ అయ్యింది. 

గల్లా వారబ్బాయితో సినిమాలో నటిస్తూనే.. పూరీ కుమారుడు హీరోగా వస్తున్న ‘రొమాంటిక్’ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉండాల్సిన నిధి సడన్‌గా గోవాలో ప్రత్యక్షమవ్వడమే ఇందుకు కారణం. గోవాలో అటు పూరీ.. ఇటు చార్మీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోందీ భామ. అయితే ప్రస్తుతం పూరీ రొమాంటిక్ సినిమా కూడా ఇక్కడే షూటింగ్ జరుగుతుండటంతో ఇందులో నిధి నటిస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి. నిధి మాత్రం అబ్బే అదేం లేదు.. హాఫ్ నా ఫేవరెట్స్‌తో ఎంజాయ్ చేశానని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చింది.

‘రొమాంటిక్’ మూవీలో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తుందని తెలుస్తోంది. అందుకే ఈ భామ ఇక్కడ షూటింగ్‌ను వదిలి మరీ అక్కడికెళ్లిందని సమాచారం. అయితే ఈ బ్యూటీ ఎందుకెళ్లింది..? ఉన్నట్టుండి గోవాలో ఎందుకు ప్రత్యక్షమైంది..? ఎందుకు గోవా వెళ్లాల్సి వచ్చిందనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ హాట్ సాంగ్‌లో నర్తిస్తుందా లేదా..? అనేది తెలియాలంటే పూరీ-చార్మీ జంట లేదా నిధీనే రియాక్ట్ అవ్వాల్సిందే మరి.

Sponsored links

Ismart Beauty Nidhi Agarwal In Special Song:

Ismart Beauty Nidhi Agarwal In Special Song

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019