నాగ్ ఆవిష్కరించిన ‘కపటధారి’ మోషన్ పోస్టర్

King Nagarjuna Unveiled Sumanth’s Kapatadhaari Title and Motion Poster

Tue 19th Nov 2019 01:38 PM
Advertisement
king nagarjuna,sumanth,kapatadhaari,title,motion poster,release  నాగ్ ఆవిష్కరించిన ‘కపటధారి’ మోషన్ పోస్టర్
King Nagarjuna Unveiled Sumanth’s Kapatadhaari Title and Motion Poster నాగ్ ఆవిష్కరించిన ‘కపటధారి’ మోషన్ పోస్టర్
Advertisement

సుమంత్ చిత్రానికి ‘క‌ప‌ట‌ధారి’ టైటిల్ ఖ‌రారు .. సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన కింగ్ నాగార్జున‌

హీరో సుమంత్, ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘క‌ప‌ట‌ధారి’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను, మోష‌న్ పోస్ట‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’, ‘ఇదంజ‌గ‌త్‌’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు ‘క‌ప‌ట‌ధారి’ అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన ‘కావ‌లుధారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ డిఫ‌రెంట్ పాయింట్‌తో రూపొందిన ‘కావ‌లుధారి’ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్ష‌న్‌లో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ వెర్ష‌న్‌లో ఇత‌ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల విడులైన విజ‌య‌వంత‌మై అర్జున్‌, విజ‌య్ ఆంటోని ‘కిల్ల‌ర్‌’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరు సంపాదించుకున్న‌ సైమ‌న్ కె.కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్ట‌ర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. విజ‌య్ ఆంటోనితో భేతాళుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో విజ‌య‌వంత‌మైన క్ష‌ణం చిత్రాన్ని తమిళంలో స‌త్యరాజ్ త‌న‌యుడు శిబిరాజ్‌తో స‌త్య అనే పేరుతో తెర‌కెక్కించి త‌మిళంలోనూ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి. ఇటీవ‌ల చెన్నైలో ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. చెన్నై, హైద‌రాబాద్ ప్రాంతాల్లో జ‌న‌వ‌రిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు. మార్చి నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.  

న‌టీన‌టులు:

సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి

నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌

యాక్ష‌న్‌: స‌్టంట్ సిల్వ‌

మ్యూజిక్‌:  సైమ‌న్ కె.కింగ్‌

ఆర్ట్‌:  విదేశ్‌

ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ కె.ఎల్‌

మాట‌లు:  బాషా శ్రీ

స్క్రీన్ ప్లే అడాప్ష‌న్‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్‌

క‌థ‌:  హేమంత్ ఎం.రావు

పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

Advertisement

King Nagarjuna Unveiled Sumanth’s Kapatadhaari Title and Motion Poster:

Kapatadhaari Title and Motion Poster Released

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement