పూరి వదిలిన ‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ టీజర్

Sat 16th Nov 2019 03:23 PM
puri jagannadh,appudu ippudu,movie,teaser,released  పూరి వదిలిన ‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ టీజర్
Puri Jagannadh Launches Appudu Ippudu Movie Teaser పూరి వదిలిన ‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ టీజర్
Sponsored links

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  చేతుల మీదుగా ‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ టీజర్ లాంచ్!!

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడు-ఇప్పుడు’.  శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య  ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుక‌గా విడుద‌లైన  ఫస్ట్ లుక్ కి, కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి, ఇటీవల  దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా లేటెస్ట్ గా ‘అప్పుడు-ఇప్పుడు’ మూవీ టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నారు. 

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ - ‘‘మా ‘అప్పుడు-ఇప్పుడు’ చిత్రం టీజర్ ను పూరి జగన్నాథ్ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.  మా యూనిట్ తరుపున ఆయనకు ధన్యవాదాలు. ఈ మూవీ ఒక  ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్  భరద్వాజ్ సంగీతం మా  సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘పూరి జగన్నాథ్ గారు మా టీజర్ ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఇప్పటికే సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు టీజర్ తో ఇటు అభిమానుల్లో అటు  ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు చలపతి పువ్వల, కొత్తవారైనా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి ...

సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి, 

ఆర్ట్: ఠాగూర్,

లిరిక్స్ః చిరావూరి విజయకుమార్,

ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,

సంగీతం: పద్మానావ్ భరద్వాజ్, 

నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు, 

దర్శకత్వం: చలపతి పువ్వల.

Click Here for Teaser

Sponsored links

Puri Jagannadh Launches Appudu Ippudu Movie Teaser:

Appudu Ippudu Movie Teaser Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019