‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’గా.. చిరు దారిలోనే..!

Sat 16th Nov 2019 09:26 PM
karthi,khaidi,donga,jyothika,karthi next film  ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’గా.. చిరు దారిలోనే..!
Hero Karthi Turns Donga ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’గా.. చిరు దారిలోనే..!
Sponsored links

యాంగ్రీ హీరో కార్తీ లేటెస్ట్‌ ఎమోషనల్‌ మూవీ ‘దొంగ’

యాంగ్రీ హీరో కార్తీ ఇటీవల విడుదలైన ‘ఖైదీ’ చిత్రంతో ఎమోషనల్‌ హిట్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘దొంగ’గా మరో ఘనవిజయాన్ని అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కార్తీ. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో ఎమోషనల్‌ మూవీగా రూపొందుతున్న చిత్రానికి ‘దొంగ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన ‘ఖైదీ’ టైటిల్‌తో కార్తీ ఇటీవల బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి మరో సినిమా ‘దొంగ’ టైటిల్‌తో వస్తున్నారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ సినిమా చేయడం విశేషం.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

Sponsored links

Hero Karthi Turns Donga:

Karthi New Film Title Announced

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019