హరీష్ శంకర్ కో డైరెక్టర్‌తో అల్లరోడి చిత్రం

Wed 13th Nov 2019 11:06 AM
allari naresh,new movie,vijay kanakamedala,satish vegesna,allari naresh new movie announcement  హరీష్ శంకర్ కో డైరెక్టర్‌తో అల్లరోడి చిత్రం
Allari Naresh’s Next A Concept Based Film With Vijay Kanakamedala హరీష్ శంకర్ కో డైరెక్టర్‌తో అల్లరోడి చిత్రం
Sponsored links

అల్ల‌రి నరేశ్ హీరోగా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ

హీరో అల్ల‌రి నరేష్ క‌థానాయ‌కుడిగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ప్రారంభం కానుంది. న‌రేష్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘మ‌హ‌ర్షి’ చిత్రంలో న‌రేశ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రో వైపు త‌న‌దైన మార్క్ కామెడీ మూవీ ‘బంగారు బుల్లోడు’ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

న‌రేశ్ న‌టించ‌బోయే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ‘మోస‌గాళ్ల‌కు మోస‌గాడు’, ‘ఒక్క క్ష‌ణం’ చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Sponsored links

Allari Naresh’s Next A Concept Based Film With Vijay Kanakamedala:

Allari Naresh Next Film Confirmed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019