Advertisement

హీరోహీరోయిన్లుగా రాహుల్ -పునర్నవీ..!

Wed 13th Nov 2019 11:21 AM
biggboss-3,rahul sipligunj,punarnavi,tollywood movie  హీరోహీరోయిన్లుగా రాహుల్ -పునర్నవీ..!
Rahul sipligunj and punarnavi Acts In Movie! హీరోహీరోయిన్లుగా రాహుల్ -పునర్నవీ..!
Advertisement

టైటిల్ చూడగానే వామ్మో.. అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. ఈ ఇద్దరు సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారట. అది కూడా హీరో హీరోయిన్లుగా అంట. అంతేకాదు ఇప్పటికే రాహుల్‌ను హీరోగా చేయాలంటూ పలువురు డైరెక్టర్స్ సంప్రదించారట. అసలు వీళ్ల వ్యవహారం బుల్లితెర నుంచి వెండితెరపైకి సాధ్యమేనా..? అది అసలు వర్కవుటయ్యే పనేనా..? అనేది ఈ కథనంలో చూద్దాం.

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్ పుణ్యమా అని సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటి పునర్నవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గూగుల్‌లోనూ ట్రెండ్ అవుతున్నారు. ఒకప్పుడు బహుశా రాహుల్ అని కొట్టినా.. పునర్నవీ అని కొట్టినా అడపా దడపా ఫొటోలు వచ్చేవి.. ఇప్పుడు మాత్రం ఇద్దరిలో ఏ ఒక్కరి పేరు కొట్టినా సరే బోలెడెన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయ్.. ఇదొక్కటి చాలు వీరి రేంజ్‌ ఎంత పెరిగిందో చెప్పుకోవడానికి. హౌస్‌లో వీళ్లిద్దరి చేష్టలు.. రాహుల్ విన్నర్‌గా నిలిచిన తర్వాత ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటలు దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్యూలో రాహుల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆసక్తికర అనడం కంటే మనసులోని మాట అనడం ఇంకాస్త బెటరేమో మరి.

వాస్తవానికి.. రాహుల్ పాటలు పాడింది అంతంత మాత్రమే.. మరోవైపు పున్నూ బేబీ నటించిన సినిమాలు కూడా ఒకటి అర తప్ప అంతకుమించి లేవు. అంటే ఇద్దరూ అంతంత మాత్రమే. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి సినిమాలో హీరో హీరోయిన్‌గా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని రాహుల్ తన మనసులో నుంచి బయపెట్టాడు. ఇంటర్వ్యూ వేదికగా విన్నర్‌గా నిలిచన తర్వాత మీకు అసలు అవకాశాలు వస్తున్నాయా..? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బిగ్‌బాస్ విన్నర్ స్పందిస్తూ..  అవును.. తనకు సినిమాల్లో ఇప్పటికే చాలా ఆఫర్లు వచ్చాయన్నాడు. అయితే ఆ సినిమాల్లో నటించాలా వద్దా..? అనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదన్నాడు. 

అంతటితో ఆగని రాహుల్.. ‘నాకు వచ్చే అవకాశాలు సంగతి అటుంచితే.. పున్నర్నవీ హీరోయిన్‌గా, నేను హీరోగా సినిమా చేయాలని ఉంది. పున్నూతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకునే ప్రసక్తే లేదు. ఎవరైనా సినిమా తీస్తే మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకోనుగాక చేసుకోను. కచ్చితంగా 100కు 110శాతం పున్నూతో కలిసి నటిస్తాను’ అని రాహుల్ తన మదిలోని మాటను బయటపెట్టాడు. వీళ్లు నటిస్తారు సరే.. సినిమా తెరకెక్కించేదెవరో..? నిర్మించడానికి ముందుకొచ్చేదెవరో..? మరి. అయితే రాహుల్ చెప్పిన ఈ మాటలపై నెటిజన్లు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వద్దండోయ్ బాబూ.. బుల్లితెర పైనే మీ వేషాలు మామూలుగా లేవ్.. ఇక సినిమాలో కూడానా.. ఆ బంపరాఫర్ మాకొద్దు అంటూ సెటైర్లేస్తున్నారు. మరి రాహుల్ కోరిక నెరవేరుతుందో లేదో..? తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ.

Rahul sipligunj and punarnavi Acts In Movie!:

Rahul sipligunj and punarnavi Acts In Movie!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement