Advertisementt

నయన్ టాప్.. తర్వాత ప్లేస్‌లో అనుష్క!

Tue 12th Nov 2019 09:38 PM
star heroines,anushka,nayanatara,remuneration,tollywood,movies  నయన్ టాప్.. తర్వాత ప్లేస్‌లో అనుష్క!
Nayanthara 1st.. Second place to Anushka నయన్ టాప్.. తర్వాత ప్లేస్‌లో అనుష్క!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో, టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. లేడి సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార సౌత్ లోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ హీరోయిన్. నయనతారని తమ సినిమాలోకి తీసుకోవాలంటే కచ్చితంగా 6 కోట్లు సమర్పించాల్సిందే. అయినా నయనతార క్రేజ్ కోసం దర్శకనిర్మాలు నయన్ అడిగింది కాదనకుండా ఇస్తున్నారు. తాజాగా నయనతార తర్వాతి ప్లేస్ గురించి చర్చకు వస్తే ఆ సెకండ్ ప్లేస్ బాహుబలి దేవసేన అనుష్కదే ఆ ప్లేస్ అంటున్నారు. రుద్రమదేవి, అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలతో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిన అనుష్కకి ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోయినా.. ప్రస్తుతం చేస్తున్న నిశ్శబ్దం సినిమా కోసం బాగానే అందుకుంటుంది అంటున్నారు.

తెలుగు, తమిళంలో అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న నిశ్శబ్దం సినిమాలో మాధవన్ కూడా మరో కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం అనుష్క అక్షరాలా 3.50 లక్షల పారితోషకం అందుకుంది అంటున్నారు. మరి మూడున్నర కోట్లు అంటే అనుష్క ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా.. ఆ రేంజ్ పారితోషకం అంటే మాములు కాదు. కాస్త లావెక్కిన కారణం సినిమాలు వదులుకుంటున్న అనుష్కకి ఈ రేంజ్ పారితోషకం చూసాక డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదనిపించక మానదు. మరి నయన్ తర్వాత ప్లేస్ అనుష్కదే.

Nayanthara 1st.. Second place to Anushka:

Star Heroines Remuneration in South

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ