చిరు చిన్నల్లుడి రెండో సినిమాపై ఈ వార్తలేంటి?

Rumours on Kalyan Dhev Second Film

Tue 12th Nov 2019 09:32 PM
Advertisement
chiranjeevi,second,son in law,kalyan dhev,movie,shelved  చిరు చిన్నల్లుడి రెండో సినిమాపై ఈ వార్తలేంటి?
Rumours on Kalyan Dhev Second Film చిరు చిన్నల్లుడి రెండో సినిమాపై ఈ వార్తలేంటి?
Advertisement

మెగా హీరోల్లో ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా జాయిన్ అయ్యాడు. శ్రీజని పెళ్లి చేసుకున్నాక కళ్యాణ్ దేవ్ మామగారు,, బావగారులా హీరో అయ్యాడు. విజేత సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఏదో మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడు. చిరు చిన్నల్లుడు అనే సాఫ్ట్ కార్నెర్ తో కాస్త యావరేజ్ గా ఆడినా... కళ్యాణ్ దేవ్ రెండో సినిమా మొదలు కావడానికి చాలా సమయం పట్టింది. ఇక రెండో సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కడం ఈమధ్యనే సూపర్ మచ్చి అంటూ ఫస్ట్ లుక్ వదలడం కూడా జరిగింది. విజేత సినిమా తర్వాత అంతగా కళ్యాణ్ దేవ్ కి క్రేజ్ రాలేదు. కానీ సూపర్ మచ్చి అంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.

అయితే తాజాగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కి ఇప్పుడొక షాక్ తగిలిందని టాక్. అదేమిటంటే అతను నటిస్తున్న రెండో సినిమా సూపర్ మచ్చి సినిమా షూటింగ్ కొంతమేర జరిగిన తర్వాత రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే టాక్ వినబడుతుంది. దాదాపు 40 శాతం షూటింగ్ జరుపుకున్న సూపర్ మచ్చి బడ్జెట్ కారణంగా ఆగిపోయిందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పులివాసు ద‌ర్శ‌కత్వంలో రిజ్వాన్ నిర్మాతగా మొదలైన ఈ సినిమా 40 శాతం షూటింగ్ టైంకి అనుకున్న బడ్జెట్ అయ్యిపోవడంతో.. నిర్మాత చేతులెత్తేశాడని టాక్. అందులోను రిజ్వాన్ నిర్మించిన తాజా చిత్రం తిప్పరా మీసం పోవడంతో... రిజ్వాన్ బాగా డల్ అయ్యి సూపర్ మచ్చి షూటింగ్ ని హోల్డ్ లో పడెయ్యడంతో కళ్యాణ్ దేవ్ సినిమా ఆగిపోయిందనే న్యూస్ మాత్రం తెగ హైలెట్ అయ్యింది.

Advertisement

Rumours on Kalyan Dhev Second Film:

Chiranjeevi Second Son in Law Movie Shelved

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement